Begin typing your search above and press return to search.

చెప్పేసినా ఒప్పుకోని ఇల్లీ

By:  Tupaki Desk   |   28 Jun 2017 4:52 PM GMT
చెప్పేసినా ఒప్పుకోని ఇల్లీ
X
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిపోయి.. అక్కడ పాగా వేసేసేందుకు తెగ ప్రయత్నిస్తున్న గోవా బ్యూటీ ఇలియానా. సినిమాలను కూడా బాగానే ఎంపిక చేసుకుంటూ.. అడపా దడపా సక్సెస్ లు కొట్టేస్తూ.. బాలీవుడ్ ని ఏలకపోయినా.. ఎదుగుతోంది ఇల్లీ.

అయితే.. ఓ విషయంలో మాత్రం ఇల్లీ బేబీ ప్రవర్తన భలే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్.. ఇలియానాకు లవర్ అనే విషయం ప్రపంచానికి తెలిసిందే. అలాగని ఆండ్రూ తన లవర్ అంటూ ఇలియానా ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రపంచానికి చెప్పిన పాపాన పోలేదు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి వెకేషన్ కు చెక్కేశారు. తననో బీచ్ బడ్డీ అని చెప్పుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడని ఇలియానా.. ఇప్పుడు ఫిజీలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ఓ స్కీయింగ్ బోట్ పై తాను ఒడ్డుకు చేరుతున్న ఓ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేసిన ఇలియానా.. 'వీడియో క్రెడిట్ మై బేబీ' అనేసింది. ఈమెను ఫోటోలు.. వీడియోలు తీసేది ఆమె లవర్ అనే సంగతి ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది.

ఇలా ఆండ్రూ తన లవర్ అనే విషయాన్ని ఇన్ డైరెక్టుగా చెబుతున్న ఇల్లీ బేబీ.. ఆ విషయాన్ని అనౌన్స్ చేయడం అనే పని మాత్రం చేయదు. ఈ విషయంలో సోనమ్ కపూర్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోతున్నట్లుగా ఉంది గోవా బ్యూటీ. ఆమె కూడా అంతే కదా! ఆంట్రప్రెన్యూర్ ఆనంద్ అహూజాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి కనిపిస్తుంది కానీ.. అడిగితే మాత్రం ఔరా.. అదేంటీ అనేస్తూ ఉంటుంది కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/