Begin typing your search above and press return to search.

ఇల్లీ పెళ్లి.. నెట్టింట్లో లొల్లి!!

By:  Tupaki Desk   |   25 Dec 2017 8:31 AM GMT
ఇల్లీ పెళ్లి.. నెట్టింట్లో లొల్లి!!
X
ఇలియానా పెళ్ళయిపోయింది.. ప్రస్తుతం మీడియాలో ఇది హాట్ హాట్ గా నడుస్తున్న న్యూస్. ఇందుకు కారణం.. సోషల్ మీడియాలో స్వయంగా ఇలియానా పోస్ట్ చేసిన ఓ పిక్.. అక్కడ ఆమె పెట్టిన ఒక కామెంట్.

క్రిస్మస్ వేడుకలను తెగ ఉత్సాహంగా జరుపుకునే ఈ గోవాబ్యూటీ.. రీసెంట్ గా ఓ పిక్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఏడాదిలో నాకు అత్యంత ఇష్టమైన సమయం అంటూ క్రిస్మస్ గురించి చెప్పింది. సంతోషంగా గడిపే సెలవు రోజులు.. ఇల్లు.. ప్రేమ.. కుటుంబం అంటూ హ్యాష్ ట్యాగులను కూడా తగిలించింది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. 'ఫోటో బై హబ్బీ- ఆండ్రూ నీబోన్ ఫోటోగ్రఫీ' అనడం దగ్గరే అసలు చిక్కంతా వచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ఇల్లీ బేబీ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

ఇలియానా లవర్ కం ఫేమస్ ఫోటోగ్రాఫర్ తీసిన పలు ఫోటోలు- వీడియోలు.. అంతవరకూ ఇల్లీలో కనిపించని అందాలను చూపించాయి. అయితే.. ఇప్పుడు అతన్ని హబ్బీ అని ఇలియానా ఉదహరించడంతో.. ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకుందనే రూమర్స్ బయల్దేరేశాయి. నిజంగా ఇలియానా పెళ్లి చేసుకుందో.. లేక ప్రేమ బాగా ఎక్కువైపోయి హబ్బీ అంటూ చెప్పుకొచ్చిందో చెప్పలేం కానీ.. ఈ ఒక్క హబ్బీ వర్డ్ కారణంగా.. ఇల్లీ పెళ్లి గురించి ఇటు మీడియాలో అటు నెట్టింట్లో లొల్లి బిగిన్ అయిపోయింది.