Begin typing your search above and press return to search.
గర్భవతి అంటే ఇల్లీ ఏం చెప్పిందిలే?
By: Tupaki Desk | 16 Jun 2018 4:47 AM GMTసినిమా హీరోయిన్ల మీద రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. అలాగని అలా వచ్చేవన్నీ నిజాలు కూడా కావు. కొంతకాలం వరకూ గోవా బ్యూటీ ఇలియానాను అందరూ పెళ్లి కాని భామే అని అనుకున్నారు. కానీ ఓ ఇన్ స్టాగ్రామ్ ట్వీట్ లో హబ్బీ అని మెన్షన్ చేయడంతో.. ఇల్లీ పెళ్లి సీక్రెట్ గా అయిపోయిందనే విషయాన్ని జనాలు ఫిక్స్ చేసుకున్నారు.
అయితే.. ఎప్పుడైతే పెళ్లి జరిగిపోయింది అనే మాటలు వినిపించాయో.. ఆ తర్వాత ఈ భామ కాసింత లావు అయినట్లుగా కొన్ని ఫోటోలు వచ్చాయి. దీంతో ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ మీడియాలో కథనాలు రావడం స్టార్ట్ చేశాయి. కొంతకాలం పాటు సైలెంటుగా ఉన్నా ఇప్పుడీ వార్తలపై ఇలియానా స్పందించింది. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ కం తన లవర్ అయిన ఆండ్రూ నీబోన్ తో తనకు గర్భం వచ్చి ఉంటే.. తాను తెగ సంతోషిస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇలియానా. ఇలా చెప్పడం ద్వారా ప్రస్తుతం తాను గర్భవతిని కాదు అంటూ డైరెక్టుగానే క్లారిటీ ఇచ్చేసింది.
ప్రస్తుతం తనకు గర్భం దాల్చే ఆలోచన ఏమీ లేదని.. ఇందుకు ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పకొచ్చింది ఇలియానా. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల పైనే దృష్టి పెట్టిన ఈ భామ.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీ మూవీతో రవితేజకు హీరోయిన్ గా నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది.