Begin typing your search above and press return to search.
రోజు 10 మెసేజ్ లు వస్తున్నాయన్న ఇలియానా
By: Tupaki Desk | 15 Jun 2022 4:58 AM GMTఇలియానా డిక్రూజ్ ఇటీవల సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ గోవా బ్యూటీ నిరంతరం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. టోన్డ్ సౌందర్యంతో మెరిసే అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్ ను నిర్వహిస్తూ అభిమానుల కోరిక మేరకు బికినీ ఫోటోలను షేర్ చేసింది ఇంతకుముందు. ఇటీవల ఒక నెటిజన్ కొన్ని 'హాట్ పిక్స్' పోస్ట్ చేయమని అడిగినప్పుడు.. దానికి ఇలియానా 2014 నాటి త్రోబాక్ ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బ్లాక్ బికినీలో యాచ్ పైన హాట్ హాట్ పోజులిచ్చింది. ఆమె లేత-ఆకుపచ్చ లెహంగాలో అందంగా కనిపించిన 2015 నుండి మరొక త్రోబాక్ ఫోటోని పంచుకుంది. ఇవన్నీ అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
తాజాగా త్రోబ్యాక్ ఫోటోలతో ఇలియానా ఇన్ స్టా కళకళలాడుతోంది. 10 సంవత్సరాల క్రితం అనురాగ్ బసు బర్ఫీ సెట్స్ వెనుక సన్నివేశానికి సంబంధించిన వేరొక ఫోటోను ఇటీవల ఈ బ్యూటీ షేర్ చేసింది! రణబీర్ కపూర్- దివంగత నటుడు హరధన్ బందోపాధ్యాయతో కలిసి ఉన్నప్పటి ఫోటో అది. బర్ఫీ! చిత్రంలో రణబీర్- ఇలియానా- ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ 85వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో భారతదేశం తరపున అధికారికంగా నామినేట్ అయ్యింది. తాజాగా మరో క్లాసీ ఫోటోగ్రాఫ్ తో అంతర్జాలంలో హీట్ పెంచింది ఇలియానా. ఇది సూట్ లో క్లాసీ లుక్. అలా కురులను ఆరబోసి నేలపై చేతిని ఆన్చి క్లాసీ ఫోజ్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇలియానా 2022లో రెండు చిత్రాలలో కనిపించనుంది. ఆమె రణదీప్ హుడా సరసన 'అన్ ఫెయిర్ అండ్ లవ్లీ'లో కనిపించనుంది. భారతదేశం లో ఫెయిర్ స్కిన్ అబ్సెషన్ ఆధారంగా రూపొందుతున్న సామాజిక కామెడీ చిత్రమిది. అలాగే విద్యాబాలన్- ప్రతీక్ గాంధీ.. భారతీయ-అమెరికన్ నటుడు సెంధిల్ రామమూర్తితో కలిసి ఇంకా పేరు పెట్టని రొమాంటిక్ కామెడీ-డ్రామాలోనూ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను ఇటీవలే ముగించింది.
బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నాను ఇలియానా డిక్రూజ్ ఓ ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ పైనా ఓపెనైంది. ఈ గోవా బ్యూటీ చాలా చిన్న వయస్సు నుండి శరీర రంగు ఇతర ఇమేజ్ సమస్యలను ఎదుర్కొన్నానని ఇటీవల వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తన శరీరం విషయంలో తాను ఎదుర్కొన్న పోరాటాల గురించి .. ఆత్మహత్య ఆలోచనల గురించి ఓపెనైంది. ఇలియానా మాట్లాడుతూ- ''నాకు ఆ రోజులు నిన్నటి కలలానే ఇంకా గుర్తున్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇది మన దేశంలో చాలా లోతుగా పాతుకుపోయిన మచ్చ. నేను 12 సంవత్సరాల వయస్సు నుండి బాడీ షేమింగ్ ని ఎదుర్కొంటున్నాను. నేను యుక్తవయస్సులోకి రాగానే.. ఎదుగుతున్న క్రమంలో ఎదుర్కొన్నాను. విచిత్రమైన వ్యాఖ్యలు ఎదురయ్యాయి. ప్రజలు మీ శరీరం గురించి కామెంట్ లు చేయడం.. ఓ మై గాడ్.. నీ బట్ ఎందుకు ఇంత పెద్దదిగా ఉంది? అని కామెంట్ చేసారు.
ఈ వ్యాఖ్యలకు తాను ఎలా స్పందించిందో కూడా చెప్పింది. అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించిందట. ఈ వ్యాఖ్యలు కొన్ని తీవ్రమైన ప్రభావానికి ఎలా దారితీశాయో తెలిపింది. మనం బాగానే ఉన్నామని అనుకుంటాం. కానీ ఇంతలోనే అకస్మాత్తుగా మన గురించి యాధృచ్ఛికంగా కొందరు వ్యక్తులు మాట్లాడుతుంటే నెమ్మదిగా వారు చెప్పేది నమ్మడం ప్రారంభిస్తాం. కాబట్టి దానిని సంవత్సరాలుగా మోస్తున్నందున ఇది లోతుగా పాతుకుపోయిన మచ్చగా మారుతుంది.. నిజానికి లోపాలను మనమే చెప్పుకోవడానికి చాలా అంతర్గత బలం అవసరం. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. .. అని తెలిపింది.
ప్రతిరోజూ కనీసం 10 మెసేజ్‌లు తనకు వచ్చేవట. బాడీ షేమింగ్ గురించి ప్రస్తుతం నా ఇన్ స్టాగ్రామ్ లో కనీసం 10 మెసేజ్ లు వచ్చి ఉంటాయి. కాబట్టి మీ గురించి ఎవరైనా ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అది కఠినంగా ఉంటుందని గ్రహించాలి. నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నది ఏమంటే.. దయచేసి మీరు మరింత దయతో మరింత సున్నితంగా ఉండగలరు. ఎందుకంటే ఇది వేరొకరిపై ఎంత ప్రభావం చూపుతుందో మీకు అర్థం కావడం లేదు. మీ నియంత్రణలో ఉన్న ఏకైక విషయం మీ ఆలోచనల్ని ఆపుకోవడం.. అని ఇలియానా అన్నారు.