Begin typing your search above and press return to search.

బొడ్డు మీద శంఖం.. ఇలియానా అడిగింది

By:  Tupaki Desk   |   26 Aug 2017 12:50 PM GMT
బొడ్డు మీద శంఖం.. ఇలియానా అడిగింది
X
టాలీవుడ్ దర్శకులు హీరోయిన్స్ ని కాస్త అందంగా చుపించాలని పడే తాపత్రయం అంత ఇంతా కాదు. ఇక్కడి ప్రేక్షకులకు నచ్చేవిధంగా కథానాయికలను వారి స్టైల్ లో వారు చూపించడానికి ప్రయత్నిస్తారు. ఇక రోమాంటిక్ సాంగ్ లో అయితే చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్ అతిలోక సుందరిగా చూపిస్తారు మన దర్శకులు. ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావ్ అయితే ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మన దర్శకులు చూపించే విధానం ఒక్కోసారి నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

రీసెంట్ గా తాప్సి ఝుమ్మంది నాథం సినిమాలో పాటలో తనపై గుమ్మడి కాయ వేయడాన్ని చాలా అవహేలన చేసి మాట్లాడడంతో టాలీవుడ్ ప్రేక్షకులను నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు అదే తరహాలో దేవదాసు సినిమాతో పరిచయం అయినా ఇలియానా కూడా తన మొదటి దర్శకుడి గురించి కొన్ని కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బాద్ షాహో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఇలియానా.. లుగులో దేవదాస్ సినిమాలోని ఓ పాట షూటింగ్ లో దర్శకుడు వైవిఎస్ చౌదరి ఒక బరువైన శంఖాన్ని బొడ్డు మీద వేసుకోమన్నాడని చెబుతూ.. అలా ఎందుకు అంటే అలా చేస్తే షాట్ అందంగా ఉంటుందని చెప్పాడట. అంతే కాకుండా మరొక సీన్ చేస్తున్నపుడు. తన నడుము చుట్టూ కూడా ఆ దర్శకుడు షో కోసమని పూలను చుట్టడం తనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పింది. కాకపోతే అవన్నీ తప్పుపట్టట్లేదని.. ఇక అమ్మాయిలను సెక్స్ వస్తువులుగా చూపించడం.. ఇండియా అంతా ఉంది కదా అంటూ పేర్కొంది.

అయితే దేవదాసు వంటి హిట్ సినిమాతో తనకి అంత మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడిపై ఇప్పుడు ఇలియానా తెలిసి కామెంట్ చేసింది తెలియక చేసిందా అని సోషల్ మీడియాలో మళ్లీ తాప్సి రేంజ్ లో కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక్కడ హిట్లు కొట్టేసి బాలీవుడ్ కు వెళ్ళి.. అక్కడకు వెళ్ళాక ఇటువంటి కామెంట్లు చేయడం బాగాలేదు అంటున్నారు జనాలు.. కానీ ఈ నార్త్ భామలెమో ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం ఆపట్లేదు.