Begin typing your search above and press return to search.
బీచ్ అంటే పిచ్చంటున్న ఇల్లీ బేబీ
By: Tupaki Desk | 30 Jun 2016 9:39 AM GMTఒక్కొక్కరికి ఒక్కో ప్లేస్ పై విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఆ ప్లేస్ కి గాని వెళితే ఎంత సేపైనా.. ఎన్ని రోజులైనా గడిపేయగలుగుతారు. ఇష్టమైన ప్రదేశాలపై ఉండే మమకారం ఇది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా.. ఆఫర్ల కోసం ఇబ్బంది పడుతున్న ఇలియానా.. ఇప్పుడు తనను బీచ్ బం అని పిలుచుకుంటోంది.
బీచుల్లో గడిపేయడమంటే ఈ బక్క భామకి బోలెడంత ఇష్టం, వెర్రి, పిచ్చి లాంటివన్నీ అంటోంది. పుట్టింది మంబైలో కావడం.. పెరిగింది గోవాలో కావడం.. బీచ్ లంటే విపరీతమైన క్రేజ్ ఉండడంలో ఇంతకంటే వేరే కారణం ఏం కవాలి. 'నాకు బీచ్ లంటే మహా ఇష్టం. నన్ను నేను ఓ బీచ్ బమ్ అనుకుంటూ ఉంటాను. కొంచెం ఖాళీగా ఉంటే బీచ్ కెళ్లి పోయి గడిపేస్తాను. ఎప్పుడెళ్లినా సరే.. చీకటి పడే వరకూ అక్కడే ఉండిపోతాను' అంటూ తనకు బీచ్ లంటే ఎంత వెర్రో చెబుతోందీ గోవా సుందరి.
బీచ్ లకు వెళ్లడమే కాదు.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులకు పంచుతూ ఉంటుంది కూడా. బీచుల్లో ఇల్లీ సరాగాలడే ఫోటోలు ఇప్పటికే చాలా ఆన్ లైన్ లో, అభిమానుల మొబైల్స్ లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన బాలీవుడ్ మూవీ రుస్తోం రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తను బాలీవుడ్ బిజీ అయిపోతానని ఈమె చాలానే ఆశలు పెట్టుకుంది. ఇటు టాలీవుడ్ లో కూడా ట్రయల్స్ చేస్తోంది కానీ.. ఏదీ సక్సెస్ కావడం లేదు.