Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ చెప్పాడు.. ఇలియానా పాటించింది
By: Tupaki Desk | 11 Nov 2018 5:30 PM GMTతెలుగులో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇలియానా. చాలా తక్కువ వ్యవధిలో ఇక్కడి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. తెలుగులో ఇంకా అవకాశాలు వస్తుండగానే ఆమె ఉన్నట్లుండి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఒకసారి అటు మళ్లాక ఇటువైపు తిరిగే చూడలేదు. ఆరేళ్ల పాటు పూర్తిగా బాలీవుడ్ కే అంకితం అయిపోయింది. ఐతే అప్పట్లో బాలీవుడ్ కు వెళ్లాలని కానీ.. అక్కడికెళ్లాక తిరిగి టాలీవుడ్ కు రావొద్దని కానీ తాను అనుకోలేదని ఇలియానా చెబుతోంది. తాను ఏ పరిస్థితుల్లో బాలీవుడ్ కు వెళ్లింది.. తర్వాత ఎందుకు ఇటు వైపు చూడనిది ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రమోషన్లలో మీడియాకు వెల్లడించింది ఇల్లీ బేబీ.
‘‘తెలుగులో జులాయి సినిమా చేస్తున్నప్పుడు `బర్ఫీ`లో నటించే ఛాన్సొచ్చింది. అప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. అప్పుడే దర్శకుడు త్రివిక్రమ్ గారిని ఏం చేయాలో సలహా అడిగా. ఆయన ఇలాంటి అవకాశం వదులుకోకంటూ ప్రోత్సహించారు. ‘బర్ఫీ’ చాలా గొప్ప కథ. అలాంటి కథ నేనెప్పుడూ వినలేదు. అందుకే ఆ సినిమా చేశాను. ఒక్క సినిమా కోసమని వెళ్తే వరుసగా ఛాన్సులొచ్చాయి. నాకు తెలుగు పరిశ్రమను వదులుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. తెలుగులో ఇక నటించనని నేనన్నట్లు రూమర్లు ఎలా వచ్చాయో తెలియదు. నేను హిందీలో నటిస్తున్నపుడు కూడా ఇక్కడ అవకాశాలు వచ్చాయి. కొన్నింటికి డేట్లు సర్దుబాటు కాలేదు. కొన్ని సినిమాల కథ నచ్చలేదు. మధ్యలో ఓ పెద్ద హీరో సినిమాకు అడిగారు. కానీ అందులో నా పాత్ర చాలా చిన్నది. అలాంటి సినిమాల్లో చేయడం వల్ల ప్రయోజనం లేదని నో చెప్పా. ఆసినిమా పేరేంటి? దర్శకుడు ఎవరన్నది మాత్రం చెప్పను’’ అని ఇలియానా అంది.