Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా ఇల్లీ ఇలాంటి పనులు చేస్తోందా?

By:  Tupaki Desk   |   23 Feb 2016 4:06 AM GMT
సీక్రెట్ గా ఇల్లీ ఇలాంటి పనులు చేస్తోందా?
X
గోవా బ్యూటీ ఇలియానా డిసౌజా.. ఇప్పుడు ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. తన బాయ్ ఫ్రెండ్ తీసిన అనేక ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేస్తోంది. అలాగే ఆండ్రూతో లవ్ లో ఉన్నట్లు ఆల్మోస్ట్ కన్ఫాం చేసింది కూడా. అయితే.. ఇప్పుడు సీక్రెట్ గా ట్రిప్పులు కూడా వేస్తోంది ఇల్లీ బేబీ. అంతే కాదు ఆ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా చెబుతోంది.

రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సీక్రెట్ గా రిక్షాలో రైడ్ కి వెళ్లింది ఇలియానా. 'చాలా కాలం తర్వాత ఆండ్రూ నీబోన్ తో రిక్షా రైడ్ కి వెళ్లాను. ఇలాంటి రైడ్స్ తరచుగా చేయాలని ఉంది' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది ఈ సుందరి. నువ్వు ఐ లవ్ యూ అంటే నా జీవితానికి లాటరీ తగిలినట్లే.. ఐలవ్యూ అంటూ ఆండ్రూ కూడా నేరుగానే చెప్పాడు ఓసారి. గతంలో కూడా వీరిద్దరూ కలిసి అనే ప్రైవేట్ ఈవెంట్స్ లో కలిసి కనిపించారు. తన ప్రేమ విషయాన్ని దాచిపెట్టేందుకు ఇల్లీ బేబీ ట్రై చేయకపోవడం విశేషం.

ప్రస్తుతం ఈ గోవా భామ అక్షయ్ కుమార్ తో కలిసి బాలీవుడ్ మూవీ రుస్తుం చిత్రంలో కలిసి నటిస్తోంది. టిను సురేష్ దేశాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రుస్తుం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీల నుంచి ఔట్ అనుకుంటున్న టైంలో.. ఇల్లీకి వచ్చిన ఈ అవకాశం మాత్రం అదుర్స్. ఇది హిట్ అయితే.. మరికొంత కాలం సినిమాల్లో కంటిన్యూ అవచ్చు. లేకపోతే ఎలాగూ ఆండ్రూ రెడీగానే ఉన్నాడు కదా పెళ్లికి.