Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దేవ‌దాస్ తో చిలిపి పారూ ఫ‌న్ టైమ్!

By:  Tupaki Desk   |   17 April 2021 5:30 PM GMT
ఫోటో స్టోరి: దేవ‌దాస్ తో చిలిపి పారూ ఫ‌న్ టైమ్!
X
హిస్ట‌రీలో పార్వ‌తి-దేవ‌దాస్ ల‌వ్ స్టోరికి ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉందో తెలిసిన‌దే. `దేవదాస్` పేరుతో తీసిన ప్ర‌తి సినిమా బ్లాక్ బ‌స్ట‌రే. రామ్ - ఇలియానా జంట‌గా ప‌రిచ‌యం అయిన న్యూఏజ్ ఫిలిం `దేవ‌దాస్` (2006) కూడా అంతే పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ ఎంట్రీ త‌ర్వాత ఇలియానా కెరీర్ వెనుదిరిగి చూసిందే లేదు. క‌థానాయ‌కుడిగా రామ్ స్టార్ డ‌మ్ ని పెంచుకున్నారు.

దేవ‌దాస్ రిలీజై ద‌శాబ్ధన్న‌ర‌ పైగానే అయ్యింది. అయినా ఇప్ప‌టికీ ఇలియానాతో తొలి చిత్ర క‌థానాయ‌కుడు రామ్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. ఆ ఇద్ద‌రూ మంచి స్నేహితులుగా కొన‌సాగుతున్నారు. ప‌లుమార్లు ముంబై వెళ్లిన‌ప్పుడు రామ్ త‌న పాత స్నేహితుల‌ను క‌లిసి రావ‌డం చూస్తున్న‌దే. ఇంత‌కుముందే రామ్ త‌న `ఢీ` స‌హ‌న‌టి జెనీలియాను క‌లిసి వ‌చ్చారు. జెనీలియా- రితేష్ జంట‌.. వారి పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు త‌న మొద‌టి చిత్ర క‌థానాయిక ఇలియానాతో స్నేహానికి సంబంధించిన ఫోటోలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ర‌వితేజ .. రామ్ స‌హా టాలీవుడ్ హీరోల‌తో ఇలియానాకు చ‌క్క‌ని సాన్నిహిత్యం ఉంది. వారితో ఫ‌న్ టైమ్ ని ఎంజాయ్ చేయ‌డం త‌న‌కు ఇష్టం. ఇప్పుడు రామ్ తో ఫ‌న్ మూవ్ మెంట్ కి సంబంధించిన ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దేవ‌దాస్ నాటి ఫ‌న్ టైమ్ ని ఇప్పుడు మ‌ళ్లీ గుర్తు చేసుకుని మ‌రీ ఇలియానా ఇలా చిల్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ ఆ ఇద్ద‌రిలో అదే అల్ల‌రి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అన్న‌ట్టు దేవ‌దాస్ మిడిలేజీలోకి ప్ర‌వేశిస్తున్నారు కాబ‌ట్టి ఇప్పుడు మ‌రో కొత్త కాన్సెప్ట్ కోసం జోడీ క‌డుతున్నారా? అన్న‌దానికి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు చెబితే కానీ క్లారిటీ రాదు.