Begin typing your search above and press return to search.

మహేష్ కి ఇల్లి మళ్లీ కావాలట

By:  Tupaki Desk   |   2 Sept 2017 8:02 PM IST
మహేష్ కి ఇల్లి మళ్లీ కావాలట
X
టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకున్న మహేష్ ఎంతో సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి ఓ దర్శకుడితో సినిమాను ఒకే చేశాడంటే చాలు మహేష్ ఇక ఆ దర్శకుడికి అస్సలు అడ్డు చెప్పాడు. ఎంత స్టార్ హోదా ఉన్నా ఏ రోజూ క్రమశిక్షణను తప్పకుండా కరెక్ట్ టైమ్ కి షూటింగ్ కి హారవుతాడని కూడా పేరుంది.

అయితే అలాంటి మహేష్ తాను నెక్స్ట్ సినిమాలో హీరోయింగ్ తాను చెప్పిన నటిని ఎంచుకోవాలని తన అభిప్రాయాన్ని చెప్పడట. ఆమె ఎవరో కాదు తనకి కెరీర్ బెస్ట్ చిత్రంలో నటించిన ఇలియానా. ఆమె అయితే సినిమాకి కరెక్ట్ గా సెట్ అవుతుందని మహేష్ చెప్పాడని టాక్. ఇంతకుముందు వారి కలయికలో పోకిరి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న తన 25వ సినిమాకి మహేష్ ఇలియానాని ఎంచుకున్నాడని రూమర్లు వెలువడుతున్నాయి.

కానీ చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా వెలువడలేదు. ప్రస్తుతం మహేష్ స్పైడర్ చివరిపాట చిత్రీకరణలో ఉన్నాడు. ఇక ఆ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇలియానా కూడా తన లేటెస్ట్ మూవీ బాద్షాహో యాజూజువల్ ఫ్లాప్ కావడంతో ఆ బాధలో ఉంది. మరి టాలీవుడ్లో ఆమెకు రి-ఎంట్రీ ఛాన్స్ నిజంగా దక్కుతుందో లేదో చూడాలి.