Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఇలియానా లాకెట్ అర్థం ఏమిటి?

By:  Tupaki Desk   |   15 April 2021 11:30 PM GMT
ఫోటో స్టోరి: ఇలియానా లాకెట్ అర్థం ఏమిటి?
X
ఫ్యాష‌న్ అండ్ స్టైల్స్ అనుక‌ర‌ణ‌లో ఇలియానా ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. బాలీవుడ్ లో ఎంతమంది ఫ్యాష‌నిస్టాలు ఉన్నా గోవా బ్యూటీ ఇలియానా త‌న‌దైన స్టైల్ కంటెంట్ తో ఆక‌ర్షిస్తుంది. ఇంత‌కుముందు ప్రియుడు ఆండ్రూ నీబోన్ ఇలియానా స్టైలింగ్ కి సంబంధించిన ఫోటోషూట్లు యూనిక్ గా ఉండేవి. ఎంచుకునే కాస్ట్యూమ్స్ ఆభ‌ర‌ణాలు నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు ఆయ‌న లేరు.

ఇక ఇలియానా ధ‌రించే ఆభ‌ర‌ణాలు దుస్తుల్లో యూనిక్ నెస్ గురించి యూత్ నిరంత‌రం ముచ్చ‌టించుకుంటారు. తాజాగా ఇలియానా షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ఎంతో ఆక‌ర్షించ‌గా.. త‌న మెడ‌లో ఉన్న స్పెష‌ల్ లాకెట్ పైనే అభిమానులు దృష్టి సారించారు.

ఇంత‌కీ ఇలియానా మెడ‌లో ఆ లాకెట్ ఏ బ్రాండ్.. దాని ప్ర‌త్యేక‌త ఏమిటి? దాని వెన‌క మీనింగ్ ఏమిటి? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇది చూడ‌టానికి చాలా వెరైటీగా క‌నిపిస్తోంది. ఇది ఇలియానా బ్రాండ్ మ‌క్రీ లాకెట్.. నిజానికి నెక్లెస్ స్పిరిట్ ఐ పెండెంట్ .. ఈవిల్ ఐ లాకెట్ .. మ‌ల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్స్ అంటూ బోలెడ‌న్ని వెరైటీలు ఉన్నాయి. కానీ ఇందులో ఇది యూనిక్ గా వేరే త‌రహా అని అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా ఇలియానా స్టైల్ ని ఎలివేట్ చేస్తోంది ఆ లాకెట్ అన్న వ్యాఖ్య‌లు యూత్ లో వినిపిస్తున్నాయి.

ఇక యాక్సెస‌రీస్ ప‌రంగా ఇలియానా ఉప‌యోగించే ఆభ‌ర‌ణాలు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ ఎంచుకునే డిజైన‌ర్ దుస్తులు కానీ వంద‌శాతం బ్రాండ్స్ తో ల‌క్ష‌ల్లో ఖ‌రీదు చేసేవేన‌నే చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఇక గోవా బ్యూటీ ఫ్యాష‌న్స్ ప‌రంగా ఎక్క‌డా త‌గ్గదు. బాలీవుడ్ లో క‌త్రిన త‌ర‌హాలోనే ఎంట‌ర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ ఇలియానాలో ఉన్నా ఎందుక‌నో పెద్ద‌గా బిజినెస్ మ్యాట‌ర్స్ లో త‌ల‌దూర్చ‌దు. అన్నిటినీ త‌న మ‌మ్మీనే చూసుకుంటోంద‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించారు ఇలియానా. ఈ భామ న‌టించిన ది బిగ్ బుల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ లో ది బెస్ట్ వీక్ష‌ణ‌లు సాధించింద‌ని ఇలియానాతో పాటు.. ఇందులో న‌టించిన క‌థానాయ‌కుడు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా ప్ర‌క‌టించారు.