Begin typing your search above and press return to search.

ప్ర‌కృతితో మ‌మేక‌మ‌వ్వ‌డ‌మెలానో చెప్పిన వాట‌ర్ బేబి

By:  Tupaki Desk   |   24 April 2021 1:30 AM GMT
ప్ర‌కృతితో మ‌మేక‌మ‌వ్వ‌డ‌మెలానో చెప్పిన వాట‌ర్ బేబి
X
వ‌ర‌ల్డ్ ఎర్త్ డే సంద‌ర్భంగా అందాల క‌థానాయిక‌ల నేచుర్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా వాట‌ర్ బేబి ఇలియానా స్పెష‌ల్ ఫోటోషూట్ గ్లింప్స్ అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఇలియానా డి క్రజ్ తరచూ ట్రావెలింగ్ ని ఇష్ట‌ప‌డుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఫిజీ దీవుల విహారం అక్క‌డ టూరిజానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగిన ఇలియానా.. ఇప్పుడు గోవా అందాల‌తో పాటు ప్ర‌కృతికి బ్రాండ్ ప్ర‌మోష‌న్ చేస్తూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది.

ఎర్త్ డే రోజున ఇలియానా మెమరీ లేన్ నుంచి తన వెకేషన్ ఆల్బమ్ లను ఇన్ స్టాలో షేర్ చేసింది. అలా చేయడం ద్వారా ప్రకృతితో తిరిగి మ‌మేకం అవుతున్నాన‌ని తెలిపింది. వాట‌ర్ బేబీగా త‌న‌కు ఇష్టమైన జ్ఞాపకాలను రీకాల్ చేసింది. తన ఎర్త్ డే-స్పెషల్ ఆల్బమ్ లో స్కూబా-డైవింగ్ -సర్ఫింగ్ చేస్తున్న ఫోటోల్ని ఇలియానా షేర్ చేసారు. ఒక జలపాతం కింద ఆడుకోవడం బీచ్ లో చిల్లింగ్ చేయ‌డం కూడా చూడవచ్చు.

ఇలియానా డి క్రజ్ న‌టించిన‌ ది బిగ్ బుల్ ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లైంది. ఇందులో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించింది. 1992 లో సెక్యూరిటీల కుంభకోణాల సందర్భంగా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది.