Begin typing your search above and press return to search.
ఇల్లీ బేబీ ఇండికేషన్ ఇచ్చేసిందిగా..
By: Tupaki Desk | 26 Aug 2015 2:10 PM GMT‘‘నేనూ అందరిలాంటి అమ్మాయినే. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. మామూలు వీధుల్లో అయినా సరే షాపింగ్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. నాకు బార్గైనింగ్ అంటే భలే ఇష్టం. ఏ వస్తువు కొన్నా బార్గైన్ చేస్తా’’ అని చెప్పింది ఇలియానా. ఓ ఈ కామర్స్ సైటు ఆరంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ఐతే ఇల్లీ బేబీ మాటలు చూస్తుంటే ఆమె కెరీర్ కు కూడా ఈ మాటల్ని అన్వయించుకోవచ్చేమో అనిపిస్తోంది. రెండేళ్ల కిందటి వరక అమ్మడి రేంజే వేరు. సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద హీరోకు జంటగా నటిస్తుండే సరికి.. టాప్ హీరోయిన్ అయిపోతానేమో అని కలలు కంది ఇలియానా. అప్పటికి ఆమె షారుఖ్, సల్మాన్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలకు కన్సిడరేషన్ లో ఉంది. కానీ ‘హ్యాపీ ఎండింగ్’ విడుదలయ్యాక అమ్మడి జాతకం తిరగబడిపోయింది.
ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా లేదు ఇలియానాకు. మొన్నటి దాకా టాలీవుడ్ అంటే ముఖం చాటేసిన ఇల్లీ బేబీ.. ఇప్పుడు అఖిల్, రామ్ చరణ్ సినిమాల్లో ఐటెం సాంగులకు రెడీ అయిపోతోంది. ముందు కోటి రూపాయల మాటెత్తిన ఇలియానా.. నిర్మాతలు బేరాలాడేసరికి బాగా తక్కువకు వస్తోందని.. 30-40 లక్షలకే ఐటెం సాంగ్స్ చేయడానికి రెడీ అయిందని టాలీవుడ్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. మున్ముందు ఆమె రేటు ఇంకా పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అమ్మడు 30కి దగ్గరైపోతోంది. నిర్మాతలు ఎంత బార్గైన్ చేసుకుంటే అంత తక్కువకు వచ్చేస్తుంది. ఈ సంగతి అందరికీ అర్థమవడానికేనో ఏమో.. ‘ఐ లవ్ బార్గైనింగ్’ అంటూ ఇన్ డైరెక్టుగా ఇండికేషన్ ఇచ్చినట్లుంది ఇల్లీ బేబీ.