Begin typing your search above and press return to search.
చెమటలు పట్టేలా ఇలియానా చేసిన పనేమిటి?
By: Tupaki Desk | 21 Jun 2020 4:30 AM GMTగడిచిన కొన్నేళ్లుగా ఇలియానా హిందీ పరిశ్రమకే అంకితమైపోయినా .. తెలుగు ప్రజలు అభిమానులు మాత్రం తనని ఇంకా మర్చిపోలేదు. ఇప్పటికీ అభిమానం చూపిస్తూనే ఉన్నారు. ఇలియానా తిరిగి తెలుగు ప్రేక్షకులకు ట్రీటివ్వాలని అభిమానులు కోరుకున్నారు. అయితే తెలుగు మేకర్స్ మాత్రం తనకు ఛాన్సులిచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇల్లీ బేబీ ఎంతగా ట్రై చేసినా కానీ ఎందుకనో మనోళ్లకు ఆసక్తి కలగ లేదు.
రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది ఇలియానా. కానీ ఫలితం నిరాశపరిచింది. కారణం ఏదైనా ఇలియానాకు ఆ తర్వాత అవకాశాలు ఇచ్చేవాళ్లే కరువయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే స్నేహితుడు అజయ్ దేవగన్ కొన్ని అవకాశాలిచ్చి సాయం చేశారు. అటుపై కొన్నాళ్లకు ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో లవ్ బ్రేకప్ తీవ్ర డిప్రెషన్ కి కారణమైంది. డిప్రెషన్ వల్ల ఎంతో బొద్దుగా మారి పోయిన ఇలియానా లుక్ ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చింది.
అయితే వీటన్నిటి నుంచి బయటపడేందుకు ఇల్లీ బేబీ ఇప్పుడేం చేస్తోందో తెలుసా? నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ శ్వేధం చిందిస్తోంది. ఇలా చేయడం వల్ల అయినా కానీసం డిప్రెషన్ నుంచి బయట పడే వీలుంటుంది! అంటూ తాజాగా ఇలియానా షేర్ చేసిన ఫోటోలకు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాల్లో ఇలియానా వెట్ లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కెరీర్ ని ఈదినంత ఈజీ కాదు. లైఫ్ ని ఈదాలంటే అంతగా చెమటలు కక్కాల్సి ఉంటుందని ఇప్పటికి అర్థమైందో ఏమిటో!!