Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ గెస్ట్‌ హౌస్‌ కి ఎందుకెళ్లినట్టు?

By:  Tupaki Desk   |   13 Aug 2015 11:06 PM GMT
డైరెక్టర్‌ గెస్ట్‌ హౌస్‌ కి ఎందుకెళ్లినట్టు?
X
సౌత్‌ నుంచి నార్త్‌ కి వెళ్లింది గోవా బ్యూటీ ఇలియానా. అక్కడ అదృష్టం పరీక్షించుకోవాలని ఎంతగానో తపించింది. స్టార్‌ హీరోయిన్‌ రేసులోకి దూసుకుపోవాలని కలలుగంది. కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిన చందంగా .. సీను రివర్సయ్యింది. బర్ఫీ చిత్రంతో ఆరంగేట్రం అదిరిపోయినా, ఆ తర్వాత మాత్రం చతికిలబడింది. నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులయ్యాయి. దాంతో ఏం చేయాలో పాలుపోని వైనం. అలాగని సౌత్‌ లో అవకాశాల కోసం ప్రయత్నించనేలేదు. ఆకలేసింది కదా అని సింహం గడ్డి తినదు అన్నట్టే ఇలియానా కూడా బింకంగానే ఉండిపోయింది.

అయితే ఇంతకాలం వేచి చూసింది. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దాంతో ఇక ఆగలేక ముంబై నుంచి నేరుగా చెన్నయ్‌ లో అడుగుపెట్టింది. అక్కడ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ గెస్ట్‌ హౌస్‌ కి నేరుగా వెళ్లింది. అతడితో ఏం మంతనాలు జరిపిందో తెలీదు కానీ, 'స్టార్‌ డైరెక్టర్‌ గెస్ట్‌ హౌస్‌ లో ప్రత్యక్షమైన హీరోయిన్‌' అంటూ తమిళ మీడియా రచ్చ రచ్చ చేసింది. ఒక్కసారిగా బిత్తరపోయిన ఇల్లూ కవర్‌ చేయడానికి నానా తంటాలు పడుతోందిప్పుడు.

ఏం స్టార్‌ డైరెక్టర్‌ గెస్ట్‌ హౌస్‌ కి వెళ్లకూడదా? వెళితే తప్పేంటి? హీరోయిన్లంతా ఇలానే వెళుతుంటారు. ఆఫీసుకో, అతిధిగృహానికో వెళ్లి కలవడం షరా మామూలే. అయినా ఆరోజు నాతో పాటే నా మేనేజర్‌ ఉన్నారు. అలాగే శంకర్‌ అక్కడ ఉన్నారు. ఎందుకింత అనుమానం? అంటూ తేలు కుట్టిన దొంగలా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలింతకీ ఎందుకెళ్లినట్టు? 'రోబో2'లో ఛాన్స్‌ ఆశిస్తోందా?