Begin typing your search above and press return to search.
ఇల్లీ బేబీ.. ఎన్నాళ్లు అవే కబుర్లు చెబుతావ్?
By: Tupaki Desk | 28 Feb 2017 5:32 AM GMTకొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత ప్రభ తగ్గగానే హీరోయిన్లు కొన్ని రొటీన్ కబుర్లు చెబుతుంటారు. గ్లామర్ పాత్రలు చేసి చేసి విసుగొచ్చేసిందని.. మామూలు క్యారెక్టర్లయితే ఒప్పుకోవట్లేదని.. ఏదో ఒక ప్రత్యేకత లేకుని సినిమాలు చేయట్లేదని కవరింగ్ మాటలు చెబుతుంటారు చాలామంది హీరోయిన్లు. ఇప్పుడు ఇలియానా కూడా అలాంటి ముచ్చట్లే చెబుతోంది. తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాక.. అనుకోకుండా బాలీవుడ్లో మంచి ఛాన్స్ రావడంతో ఇక్కడి నుంచి దుకాణం ఎత్తేసింది గోవా బ్యూటీ.
ఐతే ‘బర్ఫీ’ ఆమెకు బాలీవుడ్లో మంచి ఓపెనింగ్ ఇచ్చినా.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలేమీ రాలేదు. గత ఏడాది ‘రుస్తుం’తో హిట్టు కొట్టినా సరే.. ఇలియానా కెరీర్ ఊపందుకోలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. ఈ మాటే ఇలియానా దగ్గర ప్రస్తావిస్తే.. ఎలాంటి కథలు పడితే అలాంటివి చేయొద్దని డిసైడవడం వల్లే తాను ఖాళీగా ఉండాల్సి వస్తోందని చెప్పింది. తనకు అవకాశాలు ఇవ్వమని అడుక్కోవడం ఇష్టం లేదని.. ఆఫర్ల కోసం దేహీ అననని.. ఓ పాత్రకు తాను సరిపోతానంటే దర్శక నిర్మాతలే ఆఫర్లు ఇస్తారని అంటోంది. మరి బాలీవుడ్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే రావట్లేదా.. మరి ఆ పాత్రలకు ఇలియానా ఎందుకు ఆప్షన్ కావట్లేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. తనకు అవకాశాలు తగ్గిపోయాయని ఒప్పుకోకుండా ఇలాంటి కవర్ కబుర్లు ఎన్నాళ్లు చెబుతోంది ఇల్లీ బేబీ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/