Begin typing your search above and press return to search.
ఇలియానా మరీ ఇంత పిరికా?
By: Tupaki Desk | 14 March 2018 6:47 AM GMTసినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్న నటీమణులు ఎందరో. ఒక్క ఛాన్స్ కోసం వెళితే వారిని వాడుకోవాలని చూసే నిర్మాతలు కెమెరామెన్లు ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఎంతో మంది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. మాట్లాడిన వారంతా చిన్న చిన్న నటీమణులే. మొన్న గాయత్రీ గుప్తా నేడు శ్రీ రెడ్డి. నిజానికి ఇది సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరి సమస్యా. ఇప్పడు ఇలియానా కూడా దానిపై నోరు విప్పింది. కానీ ఒకప్పుడు ఆమె తన కెరీర్ కోసం నోరుమూసుకుని ఉంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో ఆమె చేసిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇంటర్య్వూ ఇస్తూ కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది.
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగింది ఇలియానా. అప్పట్లోనే కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ అయ్యింది. ఓ తెలుగు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక జూనియర్ నటీమణి ఆమె దగ్గరకు వచ్చి తన సమస్య చెప్పుకుంది. కొందరు ఆఫర్ కావాలంటే....గదికి రమ్మని పిలుస్తున్నారని చెప్పింది. ఏం చేయాలో తెలియడం లేదని సలహా ఇమ్మని కోరింది. దానికి ఇలియానా వెళ్లాలో వద్దో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే తన కెరీర్ ముగిసిపోతుందని తెలిసే ఇలియానా భయపడి నోరుమూసుకుని ఉంది. ఆ విషయాన్ని ఆమె ఇప్పుడు ఒప్పుకుంది. తనలాంటి ఓ అమ్మాయికి ఎదురైన పెద్ద సమస్యను ఆమెకే వదిలేసింది. తన వంతు సాయం కూడా చేయడానికి వెనుకాడింది.
కాస్టింగ్ కౌచ్ గురించి అడపా దడపా కొంతమంది యూట్యూబ్ ఇంటర్య్వూలలో బాంబులు పేలుస్తూనే ఉన్నారు. గతంలో గాయత్రీ గుప్తా సినీ రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తనను గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లాడని తాను అక్కడ్నించి తప్పించుకున్నానని చెప్పింది. అతనే సినిమాలు రాకుండా అడ్డుకుంటున్నాడని చెప్పింది. ఆ తరువాత శ్రీరెడ్డి కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేసింది.