Begin typing your search above and press return to search.

ఆయిలీ టోన్డ్ బాడీతో వ‌ల‌లు వేస్తోంది

By:  Tupaki Desk   |   25 Jan 2020 2:56 PM
ఆయిలీ టోన్డ్ బాడీతో వ‌ల‌లు వేస్తోంది
X
దాదాపు రెండు ద‌శాబ్ధాల కెరీర్ కి చేరువైంది ఇలియానా. ఇన్నేళ్ల‌లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. టాలీవుడ్ త‌న కెరీర్ కి కామ‌ధేనువే అయ్యింది. ఇక్క‌డ ఆర్జించాల్సినంతా ఆర్జించి అటుపై చివ‌రిలో బాలీవుడ్ కి జంప్ అయిపోయింది. అయితే అక్క‌డ నిరాద‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డంతో తెలుగు-త‌మిళం వైపు చూస్తోందిపుడు. కానీ ఇక్క‌డ అవ‌కాశాలొస్తాయా? అంటే సందేహంగానే మారింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇక్క‌డ ఆరంభ‌మే పొర‌పాటు చేసి దొరికిపోయింది. త‌న స్నేహితుడైన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ అవ‌కాశం ఇచ్చాడు కానీ అది కాస్తా మిస్ ఫైరవ్వ‌డంతో అస‌లు ఇలియానాను ప‌ట్టించుకున్న వాళ్లే లేరు. మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్ డిస్ట్ర‌బెన్సెస్ ఈ అమ్మ‌డిని తీవ్ర విచారంలోకి దించేశాయి. ప్రియుడు ఆండ్రూ నీబోన్ టైమ్ చూసి అమ్మ‌డితో బ్రేక‌ప్ చెప్పేయ‌డంతో ఆ పంచ్ నుంచి ఇంకా తేరుకోలేక‌పోతోంది. ఒత్తిడి వ‌ల్ల బాగా లావు అయిపోయిన ఇలియానా బ‌రువు త‌గ్గ‌లేక నానా తంటాలు ప‌డుతోంది.

క‌నీసం సినిమాల‌తో అయినా సేద దీరాల‌ని భావించినా అస్స‌లు ఛాన్సుల‌న్న‌వే లేవు. 2019లో కెరీర్ పూర్తిగా ఖాళీ అయ్యింది. ఏదో త‌న ఫ్రెండు లాంటి అజ‌య్ దేవ‌గ‌న్ కొన్ని అవ‌కాశాలిచ్చాడు కానీ.. అస‌లు వేరే ఛాన్సే లేదు. ప్ర‌స్తుతం మ‌రో సినిమా ది బిగ్ బుల్ ని దేవ‌గ‌న్ నిర్మిస్తూ ఇల్లీకి అవ‌కాశం ఇచ్చాడు. ఇందులో అభిషేక్ బచ్చ‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇక‌పోతే ఇలియానా సౌత్ ని ఆక‌ర్షించేందుకే చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. రెగ్యుల‌ర్ గా ఇన్ స్టాగ్ర‌మ్ వేదిక‌గా ర‌క‌ర‌కాల వేడెక్కించే ఫోటోల‌తో టీజ్ చేస్తోంది. తాజాగా ఇల్లీ షేర్ చేసిన టోన్డ్ లుక్ చూడ‌గానే కుర్రాళ్ల‌లో మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. అపుడెపుడో దేవ‌దాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఇలా ఆయిలీ టోన్డ్ బాడీతో మైమ‌రిపించింది. మ‌రోసారి ఫోటోషూట్ల‌లో అలాంటి మాయ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు ఇలియానా బాగా ముదురు. అందం ఉన్నా.. బాగా పెరిగిన కొలెస్ట‌రాల్ త‌న‌ని బుక్ చేసేస్తోంది. మారిన రూపం ఇట్టే తెలిసిపోతోంది. అందువ‌ల్ల ఈ గోవా చిన్న‌ది ఎన్ని వేషాలు వేసినా ఇక ప‌న‌వ్వ‌ద‌నే యూత్ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఇక‌పై అయినా ఏం జ‌ర‌గ‌బోతోందో చూడాలి.