Begin typing your search above and press return to search.

షార్ట్ కట్స్ బాగా తెలుసంటున్న బేబీ

By:  Tupaki Desk   |   16 Jun 2016 7:30 AM GMT
షార్ట్ కట్స్ బాగా తెలుసంటున్న బేబీ
X
గోవా బ్యూటీ ఇలియానా అసలు సౌత్ వైపు చూడ్డమే మానేసింది. 2012లో వచ్చిన జులాయి, దేవుడు చేసిన మనుషులు తర్వాత.. దక్షిణాదిలో ఒక్కటంటే ఒక్క సినిమా చేయలేదు ఈ అమ్మడు. మొదట ఈమె చేయలేదు.. తర్వాత చేస్తానన్నపుడు ఒక్కరూ ఆఫర్ ఇవ్వలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో కథ కంచికి చేరే స్టేజ్ కి రావడంతో.. హైద్రాబాద్ అన్నా, టాలీవుడ్ అన్నా తనకు భలే ఇష్టమని.. కబుర్లు మొదలుపెట్టేసింది. ఓ కమర్షియల్ ప్రోగ్రాం కోసం హైద్రాబాద్ వచ్చిన ఇల్లీ బేబీ చెప్పిన కొత్త కబుర్లు ఇవే.

-- హైద్రాబాద్ ఎలా ఉంది?
నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా హైద్రాబాద్ ను ఇక వదిలి వెళ్లకూడదని అనుకుంటూ ఉంటా. నాకు ఇక్కడ రోడ్లే కాదు.. షార్ట్ కట్స్ కూడా చాలా తెలుసు.

-- చివరిసారిగా ఎప్పుడు హైద్రాబాద్ వచ్చారు?
మెగాస్టార్ చిరంజీవి గారి 60 వ బర్త్ డే బాష్ కి

-- టాలీవుడ్ లో ఎవరితో అయినా టచ్ లో ఉంటారా?
పూరీ జగన్నాథ్ - దగ్గుబాటి రానా - ప్రగతిలతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటాను

-- రుస్తోం ఎక్కడి వరకూ వచ్చింది?
రీసెంట్ గా డబ్బింగ్ పూర్తి చేశాను. ఇది నాకు ఛాలెంజింగ్ రోల్. అందుకే ఒప్పుకున్నా

-- ఈ మధ్య కెరీర్ కి బ్రేక్ వచ్చినట్లుంది?
ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. అనుకోకుండానే బాలీవుడ్ కి వచ్చాను. బ్రేక్ కూడా అలాగే వచ్చింది.

-- తెలుగు సినిమాల సంగతేంటి? ఇక చేసే ఉద్దేశ్యంలేదా?
అసలు టాలీవుడ్ ని వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నేనిక్కడ ఉన్నపుడు ఏడాదికి 4 సినిమాల చొప్పున చేశా. ఎలా వదిలేస్తాను?

-- టాలీవుడ్ లో ఎందుకు బ్రేక్ వచ్చింది?
నేను బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తానని అపార్ధం చేసుకుని, ఆఫర్స్ ఇవ్వడం మానేశారు. తెలుగులో చేస్తానని ఇప్పుడు చాలామందికి క్లారిటీ ఇచ్చాను.

-- మళ్లీ కొంచెం లావయ్యారు. సినిమా కోసం లుక్ మార్చుకుంటున్నారా?
ఎలా కనిపించాలో చెప్పేందుకు తమకు హక్కుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను నాకు నచ్చినట్లుగా ఉండేందుకే ప్రయత్నిస్తాను. అవతలి వాళ్లు చెప్పినది లిమిట్స్ లో ఉంటే చేసేందుకు అభ్యంతరం లేదు.