Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీ కల్లబొల్లి కమర్షియల్ కబుర్లు

By:  Tupaki Desk   |   6 Jun 2016 5:30 PM GMT
ఇల్లీ బేబీ కల్లబొల్లి కమర్షియల్ కబుర్లు
X
గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు బాగా అంటే బాగా స్లో అయిపోయింది. టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వెలుగుతున్న టైంలో బాలీవుడ్ వైపు అడుగులేసి.. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. వాటిలో కొన్ని హిట్ అయ్యి అమ్మడి కాస్త పేరు తెచ్చాయ్ కూడా. అయితే ఇవేవీ కెరీర్ ని పరుగులు పెట్టించలేదు సరికదా.. టాలీవుడ్ లో కూడా ఆఫర్స్ ఇచ్చేవాళ్లు కరువయ్యే పరిస్థితి తీసుకొచ్చింది.

ఇల్లీ బేబీ నటించగా విడుదలైన ఆఖరి చిత్రం సైఫ్ ఆలీ ఖాన్ తో చేసిన 'హ్యాపీ ఎండింగ్'. పేరుకు తగ్గట్లుగానే అక్కడితోనే ఎండ్ అయిపోతుందేమో అమ్మడి కెరీర్ అనుకున్నారు కానీ.. అక్షయ్ కుమార్ మరి రుస్తోం ఆఫర్ ఇచ్చాడు అక్షయ్ కుమార్. మరి ఛాన్సులు తగ్గిపోయినయ్ కదా పరిస్థితేంటమ్మా ఇలియానా అంటే.. 'నాకు కమర్షియల్ సినిమాలు చేయడంలో పెద్దగా ఇబ్బంది లేదు. స్క్రీన్ మీద కాసేపు మెరిసి, డ్యాన్సులేసి మాయమైపోయే పాత్రలను చేయడం సరదానే. కానీ కొంతకాలం పోయాక.. వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం ఉండదు. చివరకు నేను శాటిస్ఫై అయే పాత్ర ఒకటి కూడా మిగలదు' అంటూ భారీ లెక్చర్ నే దంచింది ఇలియానా.

'నాకొచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోవడం లేదు. ఆ రోల్ నేను మనస్ఫూర్తిగా చేయగలిగితేనే యాక్సెప్ట్ చేస్తా' అంటూ ఓ అల్టిమేట్ స్టేట్మెంట్ కూడా పడేసింది. అవకాశాలు లేని అందాల భామలు అందరూ.. ఆఖరికి చెప్పే డైలాగ్ ఇదేగా. ఆన్సర్ అదే అయినా.. కాస్త కొత్తగా ఏదన్నా ట్రై చేసుంటే బాగుండేదేమో!