Begin typing your search above and press return to search.
దేవుడ్ని నమ్మదు.. మాజీలను కలవదు
By: Tupaki Desk | 3 Aug 2016 3:30 PM GMT''రుస్తుం'' సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది గోవా గాళ్ ఇలియానా. ఇప్పటికే ఈ సినిమాను తెలుగు టాక్ షో లలో కూడా ప్రమోట్ చేస్తున్న ఈ సుందరి.. ఇప్పుడు జీవితం గురించి చాలా ఫిలాసఫీలు చెబుతోంది. ఈ మధ్యన ఎవరన్నా లవ్ వంటి విషయాల గురించి అడిగితే చాలు.. తెగ ఓపెన్ అయిపోతోంది. అంతే కాదు.. దేవుడి గురించి కూడా చాలా కామెంట్లు చేస్తోందండోయ్.
''ప్రేమలో పడటం అనేదే ఓ వరం. కాకపోతే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలువకపోతే మాత్రం ఒక శాపం. కాకపోతే బ్రేకప్ అయిన తరువాత చాలామంది తమ మాజీ బాయ్ ఫ్రెండ్స్ తో స్నేహం చేస్తూ హ్యాపీగానే ఉంటారు. కాని నేను చేయను. ఎమోషనల్ బ్రేకప్ జరిగాక అది కష్టం. ప్రస్తుత లవ్ లైఫ్ బాగానే సాగుతోంది'' అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. ఈ మధ్యనే ఈమె ''బర్ఫీ'' కో-స్టార్ రణబీర్ కపూర్ తో.. మాజీ లవర్ దీపిక తన ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ రణవీర్ సింగుతో కలసి ఒక బర్త్ డే పార్టీలో డ్యాన్సులు వేసింది గుర్తుందా? అందుకే ఈ పంచులు కాబోలు.
అయితే ఈ ప్రేమాగీమా మనకు మనం చేసుకున్నవే ఎవరో దేవుడు మనకు ఇలా రాశాడులే అంటే అమ్మడు నమ్మదట. ''నేను దేవుడ్ని నమ్మను. ఎక్కడో ఎవరో సూపర్ న్యాచురల్ పవర్ కూర్చొని మనల్ని నడిపిస్తున్నారంటే.. అది హాస్యాస్పదం. ఇతరులు నమ్మొచ్చు.. బట్ నా ఒపీనియన్ నాది'' అంటూ తాను ఓ నాస్తికురాలు అన్నట్లుగా సెలవిచ్చింది ఇల్లీ. ఈ ఫిలాసఫీని ప్రియుడు ఆండ్రూ నీబోన్ ఎలా భరిస్తున్నాడో మరి.