Begin typing your search above and press return to search.

ఇదేమి అవతారం ఇలియానా?

By:  Tupaki Desk   |   23 July 2016 9:30 AM GMT
ఇదేమి అవతారం ఇలియానా?
X
ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా అయినా పర్లేదు - చక్కనమ్మ చిక్కినా అందమే... వంటి జాతీయాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ వాస్తవానికి వచ్చేసరికి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ వివరణకు బలం చేకూరుస్తుంది సన్ననడుం సుందరి - పోకిరీ భామ - కుర్రాళ్లను దేవదాసులను చేసిన రాక్షసి ఇలియానా! టాలీవుడ్ లో అవకాశాలు దొరక్క ప్రస్తుతం బాలీవుడ్ లో బికినీలు సైతం వేసి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఇలియానా.. తాజాగా అక్షయ్ కుమార్ తో కలిసి రుస్తుం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఇలియానా తయారైన తీరే అభిమానులకు ఆవేదనతో కూడిన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది!!

తాజాగా రుస్తుం సినిమాకు సంబందించిన ఒక ఫోటోను ఇల్లీబేబీ ఇన్ స్టా గ్రాం లో షేర్ చేసి - ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఇలియానాను చూస్తే... ముఖం పీక్కుపోయి - భుజం ఎముకలు బయటకు తన్నుకొచ్చి - దవడలు లోపలకు వెళ్లిపోయి ఉంది. ఎంత అందగత్తె.. ఇలా తయారయ్యిందేమిటి అని అభిమానులు తలలు పట్టుకుని కూర్చుంటే.. ఈ సినిమాలో తన లుక్ గురించి అందరికీ చెబుతానని ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తోంది ఇల్లీబేబి!