Begin typing your search above and press return to search.

పోకిరి ఇలియానా ఫోటో ప్రేమయాణం

By:  Tupaki Desk   |   29 May 2017 8:16 AM GMT
పోకిరి ఇలియానా ఫోటో ప్రేమయాణం
X
దేవదాసు సినిమాతో తెలుగు యువకులను ఆటాడించి జల్సా లో ముంచిన ఇలియానా ఇప్పుడు తన ఫోటో షూట్లతో బాగా బిజీగా ఉంది. కిందటి ఏడాది వచ్చిన రుస్తమ్ సినిమాతో మళ్ళీ అందరినీ మెప్పించింది. ఇప్పుడు అయితే అర్జున్ కపూర్ అతియా శెట్టి తో కలిసి నటిస్తున్న ముబారకన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని తన బోయ్ ఫ్రెండ్ తో ఫిజి బీచ్లో కొన్నాళ్లు సరదాగా గడపాలి అని అనుకుంటోంది.

ఈ ఎండలు నుండి కొంత ఊరట కోసం తన ఆస్ట్రేలియన్ బోయ్ ఫ్రెండ్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోర్న్ తో షికారులకు సిద్దం అయింది. చాలాసార్లు తన ఫోటోలతో సోషల్ మీడియా లో సంచలనం రేపిన ఇలియానా ఇప్పుడు మరోసారి తన బోయ్ ఫ్రెండ్ అండతో తన సౌందర్యాన్ని సుందరంగా చూపించబోతుంది. గతంలో ఇలాగే బీచ్ లో ఫోటో షూట్ చేసి తన అభిమానులకు మంచి కన్నులపండుగ చేసింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే రిపీట్ చేయబోతుందని అందరూ ఊహిస్తారు.

ఇప్పుడు ఇలియానా తన ప్రేమాయణంలో పడి పూర్తిగా ప్రపంచాన్ని మరిచి పాటలు పాడుకొంటుంది. మరి వీళ్ళు కూడా డేటింగ్ వరకే చేస్తారా లేదా పెళ్లి వరకు దీన్ని తీసుకువెళ్తారా అనేదే పెద్ద ప్రశ్నే. ముందు ఫిజీ నుండి రొమాంటిక్ ఫోటోలు ఏమన్నా రానివ్వండి.. అన్నీ తెలుసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/