Begin typing your search above and press return to search.

ఈ ఏడుపెందుకులే ఇలియానా

By:  Tupaki Desk   |   26 March 2016 3:30 PM GMT
ఈ ఏడుపెందుకులే ఇలియానా
X
సడన్‌ గా ఇప్పుడు ఏడుస్తోంది ఇలియానా. ఈ నడుం సోయగానికి ఇప్పుడు మీడియా తనపట్ల చాలా వివక్ష చూపించేసింది అనిపిస్తోందట. నా గురించి ఇలా బ్యాడ్‌ గా ప్రచారం చేయడం వలన నేను చాలా బాధపడుతున్నా అంటోంది.

నిజానికి 2014లో హ్యాపీ ఎండింగ్ సినిమాతో బాలీవుడ్‌ లో మెరిసిన ఇలియానా.. ఆ తరువాత ఒక్క సినిమా కూడా సైన్‌ చేయలేదు. అబ్బే కాదు.. ఒక్క డైరక్టర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌ కూడా ఈమె వైపు తిరిగి చూడలేదు. తెలుగులో రామ్‌ చరణ్‌ తని ఒరువన్‌ సినిమాలో ఛాన్సిస్తాడని అనుకుంటే.. ఎందుకోగాని మనోళ్ళు తప్పించేశారు. ఇప్పుడు 2016లో ఇప్పడు అమ్మడు రుస్తుం సినిమా చేస్తోంది. అయితే ఇన్నేళ్లూ ఎవ్వరూ ఆఫర్లు ఇవ్వలేదా అని అడగాల్సిన మీడియా వారు.. అమ్మడు ఫీలవుతుందని.. ఏమ్మా రిటైర్మెంట్‌ తీసుకున్నావా అని అడిగారు.

నిన్న ముంబయ్‌ లో రిలయన్స్‌ ట్రెండ్స్‌ నయా ఫ్యాషన్స్‌ లాంచ్‌ కు విచ్చేసిన అమ్మడిని మీడియా ఈ ప్రశ్న అడిగిందిలే. అప్పుడే రిటైర్మెంట్‌ ఏంటి.. నా గురించి అలా ప్రచారం చేయకండి అటూ భామ వాపోయింది. కాని ఇల్లూ.. అసలు క్వశ్చన్‌ ఏంటంటే.. నిన్ను ఎవరూ పెట్టుకోవట్లేదు ఎందుకని? అది అర్ధం చేసుకో.. ఇలా ఏడవకు!!