Begin typing your search above and press return to search.

వాట‌ర్ బేబి ఇలియానా టోన్డ్ స్వెట్ బికినీ

By:  Tupaki Desk   |   1 Aug 2022 8:53 AM GMT
వాట‌ర్ బేబి ఇలియానా టోన్డ్ స్వెట్ బికినీ
X
అందాల క‌థానాయిక‌ ఇలియానా డిక్రజ్ వాటర్ బేబీగా పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేన్స్ తో ఇలియానా ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. గోవా టు మాల్దీవులు .. ఫిజీ దీవులు ఇల్లీకి కొత్తేమీ కాదు. నిరంత‌రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బికినీ బీచ్ లలో ఈ గోవా బ్యూటీ ఒక విస్ఫోట‌నంగా మారుతోంది. వీలున్న ప్ర‌తిసారీ త‌న టోన్డ్ బాడీని ఎలివేట్ చేసేందుకు ఇలియానా ఎంతో శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుంది.

తాజాగా వెల్వెట్ బ్లూ బికినీలో పోజులిచ్చిన చిత్రాన్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. ఇలియానా అద్భుతమైన స్నాప్ షాట్ ను పోస్ట్ చేసిన వెంటనే యూత్ లో ప్ర‌కంప‌నాలు స్టార్ట్ అయ్యాయి. దీనికి హాట్.. కిల్లింగ్ .. సెక్సీ అంటూ పొగడ్త‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మీరు అందానికి సింబ‌ల్ అని ఒక అభిమాని ప్ర‌శంసించారు. మీరు వృత్తిపరంగా ప్రైవేట్ వ్యక్తిగా మిమ్మల్ని మీరు ప్రదర్శించే విధానం మీకు గొప్ప అభిరుచి ఉంద‌ని నిరూపిస్తున్నాయి అని వేరొక అభిమాని పొగిడేసాడు. మ‌రొక నెటిజన్ ఇలా రాసాడు. ``ఎవరూ అందంగా ఉండలేరు… మీ కంటే ఎక్కువ.. ఎందుకంటే మీరు బయటి నుండి మాత్రమే కాదు ... లోపల నుండి కూడా ... మీరు నిజమైన అరుదైన అందానికి ఏకైక అర్ధం`` అంటూ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

కొత్త డేటింగ్ తో టౌన్ లో మిస్సింగ్?

ఇటీవ‌ల కత్రినా కైఫ్ కి 39వ పుట్టినరోజు సందర్భంగా మాల్దీవుల సెల‌బ్రేష‌న్స్ నుండి గ్రూప్ సెల్ఫీని పోస్ట్ చేసిన‌ ఇలియానా సెల‌బ్రేష‌న్ మోడ్ లో క‌నిపించింది. ఆ సెల్ఫీలో కత్రినా సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఇలియానా స‌న్నిహితంగా క‌నిపించ‌డం తో ఆ ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లకు దారితీసింది.

ఇలియానా-సెబాస్టియన్ సుమారు ఆరు నెలలుగా డేటింగ్ లో ఉన్నారని క‌థ‌నాలొచ్చాయి. ఇద్దరూ తరచూ బాంద్రాలోని కత్రినా పాత ఇంట్లో క‌లుసుకునేవారు. శివారు ప్రాంతంలోని ఇలియానా అపార్ట్ మెంట్ లో అలాగే లండన్ లో కలిసి షికార్లు చేస్తున్నార‌ని గాసిప్స్ వినిపించాయి. ఇలియానా - సెబాస్టియన్ ఎవ‌రికి వారు సోష‌ల్ మీడియాల్లో పరస్పర అనుచరులను కలిగి ఉన్నారు. లండన్ లో నివాసం ఉంటున్న సెబాస్టియన్ వృత్తిరీత్యా మోడల్ గా గుర్తింపు పొందాడు. కత్రినా విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్నప్పుడు అతను రాజస్థాన్ - ముంబైలో కనిపించాడు. సెల్ఫీ ఫోటోలో ఇలియానాతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న కత్రినా- విక్కీ- మినీ మాథుర్- ఇసాబెల్లె కైఫ్- సెబాస్టియన్ - ఆనంద్ తివారీ క‌నిపించారు. కత్రినా - ఇలియానా ఇంత మంచి స్నేహితులు ఎలా.. ఎప్పుడు ఎలా మారారు? అని ప్రజలు ఆరాలు తీయ‌డం వేడెక్కించింది. ఇలియానాతో సెబాస్టియన్ కనెక్షన్ గురించి ప్రజలు ఊహాగానాలు ప్రారంభించారు.

ఇలియానాకు గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రొమాంటిక్ కనెక్షన్ ఉన్న సంగ‌తి తెలిసిందే. నీబోన్ పై తనకున్న ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తపరిచేది. అతనితో చాలా హాయిగా ఓపెన్ గా ఫోటోల‌ను షేర్ చేసేది. ఇద్దరూ జంట‌గా కలిసి అద్భుతంగా కనిపించేవారు. కానీ వారి మధ్య విభేధాలు పెద్ద‌వై విడిపోయే స‌న్నివేశం ఎదురైంది. కాబట్టి వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఇలియానా చివరిసారిగా అభిషేక్ బచ్చన్ తో కలిసి `ది బిగ్ బుల్`లో కనిపించింది. ఈ చిత్రం 1992 నాటి స్టాక్స్ సెక్యూరిటీ స్కామ్ ఆధారంగా రూపొందింది. తదుపరి `అన్ ఫెయిర్ ఎన్ లవ్లీ`లో కనిపించనుంది. ఇది ఫెయిర్ స్కిన్ పై భారతదేశం అభిరుచికి సంబంధించిన కామిక్ కాప‌ర్. హర్యానా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణదీప్ హుడా సరసన ఇలియానా నటిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని వేరొక హిందీ చిత్రంలో విద్యాబాలన్- ప్రతీక్ గాంధీ- ఇండియన్-అమెరికన్ సంచలనం సెంధిల్ రామమూర్తితో కలిసి ఇలియానా న‌టించ‌నుంది.