Begin typing your search above and press return to search.

ఇల్లీ.. ఇంత రెచ్చిపోయావేంటి?

By:  Tupaki Desk   |   19 Feb 2016 7:43 AM GMT
ఇల్లీ.. ఇంత రెచ్చిపోయావేంటి?
X
రోమ్ కు వెళ్లాక రోమన్ లాగా ఉండాలంటారు. ఇలియానా ఈ విషయం బాగా వంటబట్టించుకున్నట్లుంది. సౌత్ లో ఉన్నంత వరకు కొంచెం పద్ధతిగానే ఉన్న ఈ గోవా బ్యూటీ.. బాలీవుడ్లో మాత్రం రెచ్చిపోయింది. లిప్ లాక్స్.. ఇంటిమేట్ సీన్స్.. బికినీస్.. హాట్ హాట్ ఫొటో షూట్స్.. బోల్డ్ కామెంట్స్.. అబ్బో చాలా వేషాలే వేసింది ఇలియానా. ఐతే అంత చేసినా ఆమెకు అక్కడ అవకాశాలైతే పెద్దగా లేవు. దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉన్న ఇల్లీ.. ఈ మధ్యే అక్షయ్ కుమార్ సరసన ఓ అవకాశాన్ని దక్కించుకుంది.

మరి ఈ ఏడాది గ్యాప్ లో ఇల్లీ ఏం చేసిందీ అంటే.. సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పటికప్పుడు మసాలా అందిస్తూ కాలక్షేపం చేసింది. ఈ రోజు ఇల్లీ బేబీ ఏం ఫొటోలు పెడుతుందా.. ఏం కామెంట్లు చేస్తుందా అని ఆమె ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్లు ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లు. ఎలాగూ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ ఫొటోగ్రాఫరే కావడంతో ఇల్లీకి ఢోకా లేకపోయింది. ఇలా ఈ ఏడాదిలో తన సోషల్ మీడియా ఫాలోయింగ్ ను బాగా పెంచుకుంది గోవా బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్ లో ఈ మధ్యే ఆమె ఫాలోయర్ల సంఖ్య 20 లక్షలకు చేరుకోవడం విశేషం. ఈ ఆనందంలో రెండు మిడిల్ ఫింగర్స్ చూపిస్తే సంబరాలు చేసుకుంది ఇల్లీ. మరీ ఇలా మిడిల్ ఫింగర్ చూపిస్తూ రెచ్చిపోవడాన్ని బట్టే ఇల్లీ ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.