Begin typing your search above and press return to search.
సన్నజాజి బొండుమల్లె రూపం
By: Tupaki Desk | 29 Oct 2018 3:30 PM GMTసన్నజాజి తీగకు మారు రూపంలా.. జాజికొమ్మను విరబూసిన జాజి పువ్వులా అందంగా కనిపించేది ఇలియాన. సైజ్ జీరో రూపంతో కరీనాకి చెల్లెలా? అని అనుకునేవారంతా. కానీ ఇప్పుడా సీన్ లేదు. అసలు ఇలియానా తనలా లేదు. ఇంకెవరిలానో కనిపిస్తోంది. ఇకమీదట కవులెవురూ ఇలియానా.. చిల్లియానా.. అని లిరిక్ రాయలేరు. ఎందుకంటే ఆ రూపం అంతగా ఊహాతీతంగా మారిపోయింది. మునుపెన్నడూ కనిపించనంత బొద్దుగా మారిపోయింది.
ఈ బొద్దందం వెనక చాలానే కథ ఉందన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇలియానా లూజ్ దుస్తుల వ్యవహారంపై తామరతంపరగా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇలియానా మారు రూపం చూస్తుంటే ఇంకా ఇంకా సందేహాలు కలుగుతున్నాయి. ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ఈ భామ సహజీవనంలో త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందా? అన్న సందేహాల్ని బాలీవుడ్ మీడియా ఇప్పటికే వ్యక్తం చేసింది. పలు సందర్భాల్లో దీనిపై జరిగిన రచ్చకు ఇల్లూ కౌంటర్ కూడా ఇచ్చింది. పెళ్లి చేసుకుంటే - పిల్లాడిని కంటే నేనే మీడియాని పిలిచి చెబుతాను అంటూ సురసురలాడింది.
లేటెస్టుగా బోయ్ ఫ్రెండ్ నీబోన్ తో కలిసి ముంబై విమానాశ్రయంలో ఇలా దర్శనమిచ్చింది. తెలతెల్లని ఫ్రాకు - ఆ పైన కవర్ చేసిన దుపట్టా.. శరీర అంగసౌష్టవాన్ని ఎలివేట్ చేస్తున్న ఈ గెటప్ చూస్తుంటే ఇల్లూ కొత్తగా కనిపిస్తోందన్న మాటా వినిపిస్తోంది. ముఖ్యం గా ఒళ్లంతా కండ పుష్టితో నిగనిగలాడడం ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది. ఈ కొత్త మెరుపు వెనక అసలు గుట్టేంటో ఇల్లూనే చెబుతుందేమో చూడాలి. రైడ్ తర్వాత బాలీవుడ్ లో వేరే సినిమా ఏదీ చేయడం లేదు. తెలుగులో `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే.