Begin typing your search above and press return to search.
టాలీవుడ్లో ఇలియానా ఫేవరెట్ ఎవరు?
By: Tupaki Desk | 5 July 2017 6:25 AM GMTబాలీవుడ్ వెళ్లిపోయాక తెలుగు సినిమాల గురించి మాట్లాడ్డమే మానేసింది ఇలియానా. ఆమె తీరు చూస్తే తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ను తక్కువగా చూస్తున్నట్లు అనిపించింది. ఐతే ఆశ్చర్యకరంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన టాలీవుడ్ కెరీర్ గురించి నెమరు వేసుకుంది ఇల్లీ బేబీ. కెరీర్ ఆరంభంలో తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది.. టాలీవుడ్ హీరోల్లో తన ఫేవరెట్ ఎవరు అనే విషయాలపై ఆమె ఓపెన్ అయింది.
తెలుగులో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రవితేజ.. ఇలా చాలామంది స్టార్ హీరోలతో నటించిన ఇలియానా.. వాళ్లందరిలో తనకు మాస్ రాజా రవితేజ అంటే చాలా ఇష్టమని ఇలియాన చెప్పింది. రవితేజతో ఉంటే సమయమే తెలియదని.. అతడి ఎనర్జీ తనకు నచ్చుతుందని ఇలియానా తెలిపింది. ఇలియానా మాస్ రాజాతో తొలిసారి నటించిన ‘ఖతర్నాక్’ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. తర్వాత వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ బ్లాక్ బస్టర్ అయింది. ఐతే చివరగా వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా డిజాస్టర్ అయింది.
ఇక టాలీవుడ్లో తొలి రోజుల గురించి ఇలియానా చెబుతూ.. ‘దేవదాసు’ చేసే సమయానికి తనకు ఇంగ్లిష్ తప్ప ఏమీ రాదని చెప్పింది. తెలుగు కానీ.. హిందీ కానీ.. తెలియదని.. సెట్లో.. బయట ఇంగ్లిష్ తోనే మేనేజ్ చేసేదాన్నని.. కానీ మీడియా వాళ్లు హిందీలో అయినా మాట్లాడమని అడిగేవారని.. అప్పట్లో ప్రెజర్ తట్టుకోలేక ఓ మూడు వారాలు ఇండియా వదిలేసి ఫారిన్ వెళ్లిపోయానని ఇల్లీ బేబీ తెలిపింది. ఐతే తర్వాత తర్వాత ఇక్కడి పరిస్థితులకు బాగానే అలవాటు పడిపోయానని ఆమె చెప్పింది.