Begin typing your search above and press return to search.

బాబోయ్ ఆ రెండు ఇండ‌స్ట్రీల‌కు న‌మ‌స్కారం

By:  Tupaki Desk   |   7 Aug 2020 10:10 AM GMT
బాబోయ్ ఆ రెండు ఇండ‌స్ట్రీల‌కు న‌మ‌స్కారం
X
తెలుగు సినిమాతోనే క‌థానాయిక అయ్యింది. మొద‌టి సినిమాతో హిట్టు కొట్టి అటుపై ఇంతింతై ఇక్క‌డ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ త‌న‌కు ఎంతో లైఫ్ ని ఇచ్చింది. డ‌బ్బు సంపాద‌న‌తో పాటు పేరు.. హోదా కూడా ద‌క్కింది. కానీ ఈ ఇండ‌స్ట్రీపై గోవా బ్యూటీ ఇలియానా అల‌క ఎందుకు?

డెబ్యూ కావాలంటే టాలీవుడ్.. రీఎంట్రీ ఇవ్వాలంటే టాలీవుడ్ .. డ‌బ్బు పేరు గంప‌గుత్త‌గా సంపాదించాలంటే టాలీవుడ్ .. అన్నిటికీ టాలీవుడ్ కావాలి. కానీ ఎందుక‌ని ఇంకా ఈ కినుక‌. ఉన్న‌ట్టుండి ఎందుకిలా మారిపోయింది ఇల్లీ బేబీ? ఉన్న‌ట్టుండి మాట మార్చేస్తోంది ఎందుక‌ని?

బాబోయ్.. తెలుగు- తమిళ్ ఇండస్ట్రీలకు ఓ నమస్కారం..! అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది ఇంత‌కుముందు. అలా ఎందుకు అనేసింది. అసలు ఈ రెండు ఇండస్ట్రీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదట‌. బాలీవుడ్ .. అలానే పాన్ ఇండియా సినిమాలపైనే నా ఫోకస్ అని చెబుతోంది. ఆ రెండిటి గురించే ఆలోచిస్తూ వాటికోసమే ట్రై చేస్తున్నాన‌ని ఇటీవ‌ల ఇలియానా మీడియా కి చెప్పింది. మ‌రి ఇలాంటి భామ‌కు తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌రో అవ‌కాశం క‌ష్ట‌మే. సౌత్ ఇండ‌స్ట్రీలపై ఎందుక‌నో ఆ విర‌క్తి? బాలీవుడ్ లో స్నేహితుడు అజ‌య్ దేవ‌గ‌న్ త‌న‌కు అండ‌గా నిలిచి అవ‌కాశాల విష‌యంలో సాయం చేస్తున్నాడు కాబ‌ట్టే ఇలా అనేస్తోందా? అయినా ఇలియానా త‌న బోయ్ ఫ్రెండ్ ఆండ్రూకి బ్రేక‌ప్ చెప్పేశాక ఎవ‌రూ ఊహించ‌నంత‌గా స‌న్నబ‌డిపోయింది. త‌న‌ని ఇలా చూసినా అవ‌కాశాలివ్వ‌రు ఎందుక‌నో!!