Begin typing your search above and press return to search.

ఇలియానా సెక్స్ పాఠాలు

By:  Tupaki Desk   |   18 July 2015 3:38 PM IST
ఇలియానా సెక్స్ పాఠాలు
X
వాతావ‌ర‌ణం మ‌హ‌త్య‌మో మ‌రేంటో తెలియ‌దు కానీ... బాలీవుడ్ వెళ్లాక బాగా బోల్డ్ గా మారింది ఇలియానా. మాట‌లు, చేత‌లు అన్నీ బోల్డ్ గానే ఉంటున్నాయి. ఆమ‌ధ్య ట్విట్ట‌ర్లో బ్రా గురించి ఓ వ్యాఖ్య చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. `గ‌దిలోకి రాగానే ఒంటిచేత్తో బ్రా బ‌య‌టికి లాగి మూల‌కి విసిరేస్తే ఆ కిక్కే వేరు. అది మ‌గాళ్ల‌కి ఎప్ప‌టికీ అర్థం కాదు` అంటూ ఇలియానా చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపాయి.

వామ్మో... ఇలియానా మ‌రీ ఇంత బోల్డా అని మాట్లాడుకొన్నారు కుర్రాళ్లు. ఇప్పుడేమో మ‌రింత లోతుకి వెళ్లిపోయింది. ఏకంగా సెక్స్ పాఠాలు చెబుతోంది. ఏమాత్రం సిగ్గు ప‌డ‌కుండా సెక్స్ వ‌ల్ల ఎన్ని లాభాలో చెప్పుకొచ్చింది. ఈమ‌ధ్య ఇలియానానికి సినిమాలేమీ లేవు. తెలుగుకి మ‌ళ్లీ తిరిగి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లోనే ఓ హెల్త్ మేగ‌జైన్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇలియానా అన్నీ సెక్స్ క‌బుర్లే చెప్పింది. ``సెక్స్ అంటే అంద‌రూ ఒక ర‌క‌మైన దృష్టితో చూస్తారు. ఆ విష‌యంలో సిగ్గు ప‌నికి రాదు. దాని గురించి అంద‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాలి. సెక్స్‌ తోనే మ‌న‌సు, ఆలోచ‌న‌లు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. సెక్స్ చేసుకొన్న‌వాళ్లు ఎప్పుడూ ఫిట్‌ గా ఉంటారు తెలుసా?`` అని సెల‌విచ్చింది. ``పెళ్లికి ముందు సెక్స్ త‌ప్పా, క‌రెక్టా ? అని అడుగుతూ విష‌యాన్ని త‌ప్పుదారి ప‌ట్టిస్తుంటారు కానీ... దాని గురించి స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించడంలో స‌మాజం విఫ‌ల‌మ‌వుతోంద‌ని చెప్పుకొచ్చింది ఇలియానా. నిజంగా ఇలియానా మాటల్లోనూ నిజ‌ముంది క‌దా!!