Begin typing your search above and press return to search.

గ్లామర్ కంటెంట్ వర్కవుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   16 Jan 2018 8:40 AM GMT
గ్లామర్ కంటెంట్ వర్కవుట్ అవుతుందా?
X
నాజూకుదనానికి నిలువెత్తు చిరునామాగా పేరున్న ఇలియానా కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది. వరస క్రేజీ ప్రాజెక్టులతో దాదాపు యంగ్ హీరోలందరితోనూ జత కట్టింది ఈ గోవా సుందరి. తరవాత బాలీవుడ్ లో అవకాశం రావడంతో సౌత్ కు టాటా చెప్పేసి ముంబయికి మకాం మార్చేసింది.

ఇలియానా మొదటగా హిందీలో నటించిన బర్ఫీ సూపర్ హిట్ అవడంతోపాటు నటన పరంగానూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో అన్ని రొటీన్ కమర్షియల్ సినిమాలే చేశానంటూ కాస్తంత చిన్నచూపు చూసి మాట్లాడింది. కానీ బాలీవుడ్ లో ఛాన్సులు అంతంతగానే వచ్చాయి. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో టీవీ సీరియళ్లలో నటించాలని భావిస్తోందట. నటనలో ఇలియానా స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా తడుముకోకుండా చెప్పేది ఆమెలోని గ్లామర్ కంటెంట్ అండ్ సెక్సప్పీల్ గురించే. టీవీ సీరియళ్లకు ఈ రెండింటి అవసరమూ పెద్దగా ఉండదు. ఇన్నేళ్లగా తన ఒంపుసొంపులతోనే వెండితెర ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఇలియానా టీవీ ప్రేక్షకులను మెప్పించాలంటే రూటు మార్చాల్సిందే.

ఇలియానా తెలుగులో చివరగా అల్లు అర్జున్ తో జులాయి సినిమా చేసిన తరవాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూసింది లేదు. ఒకట్రెండు సినిమాలకు ఆఫర్ వచ్చినా భరించలేనంత రెమ్యునరేషన్ చెప్పి వారిని బెదరగొట్టి పంపేసిందని టాలీవుడ్ టాక్. ఇప్పుడు అక్కడ ఛాన్సుల్లేక.. ఇక్కడకు తిరిగి రాలేక ఇలా సీరియళ్లతో సర్దుకుపోవాల్సి వస్తోంది.