Begin typing your search above and press return to search.

ఈ ఏడాది చూసి.. ఇలియానా కూడా..

By:  Tupaki Desk   |   30 May 2016 9:30 AM GMT
ఈ ఏడాది చూసి.. ఇలియానా కూడా..
X
అవకాశాల రాకపోతే ఏం చేస్తారు చెప్పండి. ఎప్పటికీ హీరోయిన్‌ కొనసాగాలంటూ శ్రీయ టైపులో అలాగే పట్టుకొని వేలాడటం అందరివలనా కాదు. పైగా శ్రీయ చాలా సెక్సీ అండ్‌ హాట్‌ గా ఉండటంతో.. ఆమెకు అరకొరా రోల్స్ అయినా ఆఫర్‌ చేస్తున్నారు. కాని కొంతమంది హీరోయిన్లకు అది కూడా లేదు.

మొన్న ప్రియమణి చూడండి.. సడన్‌ గా ఎంగేజ్‌ మెంట్‌ అంటూ షాకిచ్చింది. ఎలాగో ఆమెకు సినిమాలేవీ లేవు. చేతిలో ఉన్న సినిమాలన్నీ చిన్నాచితక ప్రాజెక్టులే తప్పించి.. వరుసగా కెరియర్‌ ను నిలబెట్టేసే కత్తిలాంటి సినిమాలు కాదు. అందుకే అమ్మడు చక్కగా పెళ్ళి చేసుకుని రిలాక్స్ అవ్వాలని డిసైడ్‌ అయిపోయింది. ఇప్పుడు ఇలియానా పరిస్థితి కూడా అంతే అని తెలుస్తోంది. కాకపోతే ఆమె ఒక్క ఏడాది వెయిట్‌ చేస్తుందిట. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఆమె అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' అనే సినిమాను చేసింది. ఆ సినిమా కనుక హిట్టయ్యి కెరియర్‌ టర్న్ అయితే ఓకె.. లేకపోతే మాత్రం వచ్చే ఏడాది ప్రియుడు యాండ్రూ నీబోన్‌ ను పెళ్ళి చేసుకొని అమ్మడు ఆస్ర్టేలియాలో అతనికి అసిస్టెంట్‌ ఫోటోగ్రాఫర్ గా సెటిలయ్యే ఛాన్సుంది.