Begin typing your search above and press return to search.

సినిమాలు మానేసి ఫోటోగ్ర‌ఫీ చేస్తోంది

By:  Tupaki Desk   |   30 Dec 2015 4:33 AM GMT
సినిమాలు మానేసి ఫోటోగ్ర‌ఫీ చేస్తోంది
X
న‌డువొంపు న‌యారం ఇలియానా ఏం చేస్తోంది? ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాలేవీ రాలేదేంటి? ర‌క‌ర‌కాల సందేహాలొస్తున్నాయ్ ఫ్యాన్స్‌ కి. వీటికి స‌మాధానం చెప్పేదెవ‌రు? ఎలానూ తెలుగు - త‌మిళ్‌ కి దూర‌మైంది. క‌నీసం హిందీలో అయినా ఏమైనా వెల‌గ‌బెడుతోందా? అంటే అదీ క‌నిపించ‌డం లేదు. అప్ప‌ట్లో ఓ విదేశీ యువ‌కుడి మోజులో ప‌డి అన్నిటినీ వ‌దిలేసింద‌ని అన్నారు. ప్రేమ‌లో మ‌త్తును ఆస్వాధించే ప‌నిలో ప‌డింద‌ని మీడియా కోడై కూసింది.

పాపం హ్యాపీ ఎండింగ్ త‌ర్వాత త‌న కెరీర్ మ‌రీ ఇలా ఎండ్ అయిపోతుంద‌ని ఊహించి ఉండ‌దు. వ‌రుస ప‌రాజ‌యాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయ్‌. ఇప్ప‌టికే ఇల్లూ బేబి న‌టించిన సినిమా రిలీజై ఏడాది పైనే అయిపోయింది. మ‌రి ఇంత‌కాలం ఖాళీగానే కూచుని ఏం చేస్తోంది? అనే సందేహం వ‌స్తే.. దానికి సమాధానం కూడా రెడీ చేసి పెట్టుకుంది మ‌రి. వ‌న్ ఫైన్‌ డే మీ అంద‌రికీ ఇలాంటి సందేహం ఏదో వ‌స్తుంద‌ని నాకు ముందే తెలుసు. అందుకే నా స‌మాధానం నాకు రెడీగా ఉంది. ఖాళీ స‌మ‌యాల్లో ఫోటోగ్ర‌ఫీ ఎంతో బావుంటుంది. నేను ఇటీవ‌లి కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్‌ గా ఫోటోగ్ర‌ఫీకి అంకిత‌మైపోయాను. ముఖ్యంగా ఫోటోగ్ర‌ఫీతో ప్రేమ‌లో ప‌డిపోయా. పిల్ల‌లు మ‌నంద‌రికీ రోల్ మోడ‌ల్స్‌. అందుకే పిల్ల‌ల‌కు సంబంధించిన ఫోటోల్ని మాత్ర‌మే చాలా ఎక్కువ‌గా తీశాను... అంటూ చెప్పుకొచ్చింది.

అన్న‌ట్టు సినిమాల్లేని ఇల్లూ ఫోటోగ్రాఫ‌ర్‌ గా మారిపోయి ఏ విదేశీ బీచ్ లోనూ ఫోటోలు తీసుకుంటూ డాల‌ర్లు ఏరుకుంటూ కాల‌క్షేపం చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆ సీన్ ఓసారి ఊహించుకోండి. ప్చ్‌. .... టూ శాడ్ క‌దూ? త‌న‌ని ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల్ని కాద‌ని వెళ్లినందుకు త‌గిన శాస్తి జ‌రిగింద‌నుకోవాలి మ‌రి!