Begin typing your search above and press return to search.

మెచ్చినోడు తీసినా నచ్చడం లేదు

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:30 PM GMT
మెచ్చినోడు తీసినా నచ్చడం లేదు
X
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేజ్ ని అనుభవించిన ఇలియానా.. తర్వాత మెల్లగా బాలీవుడ్ రూట పట్టేసింది. అక్కడ బర్ఫీ లాంటి మంచి హిట్స్ పడ్డా, పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డా.. కెరీర్ మాత్రం క్లిక్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో మళ్లీ వెలిగిపోదామని వెయిట్ చేస్తోంది. ఇందుకు మంచి ప్లాన్లే వేసింది. గ్లామర్ ఇండస్ట్రీలో మెరుపులు మెరిపించడానికి షార్టెస్ట్ రూట్ ఫోటో షూట్ లే.

నిజానికి ఇల్లీ బేబీ కూడా ఇదే రూట్లో బాలీవుడ్ వెళ్లింది. అప్పట్లో ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్ ని పట్టుకుని, సూపర్బ్ షూట్స్ చేయించి, హిందీ నిర్మాతల కంట్లో పడింది. చెన్నైకి చెందిన ఇతగాడికి ఫోటోగ్రఫీలో మంచి పేరుంది. బోలెడు డిమాండ్ కూడా ఉంది. రోజుకు 10 లక్షలు ఛార్జ్ చేసేంతటి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకి కి చెందిన ఆండ్రూ నీబోన్ అనే ఫోటోగ్రాఫర్ తో ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేయిస్తోంది ఇలియానా. ఇందుకోసం ముంబై ఆస్ట్రేలియా చక్కర్లు కూడా కొడుతోంది. ఇదంతా టాలీవుడ్ లో మళ్లీ పాతుకుపోవాలనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నమే అన్నది ఇన్ సైడ్ టాక్. అయితే.. ఈ ఫోటోలేవీ ఇల్లీ బేబీకి కూడా నచ్చడం లేదంట. బాయ్ ఫ్రెండ్ తీసిన ఫోటోలపై బాగా డిజప్పాయింట్ అయిందని తెలుస్తోంది.

రీఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటుంటే.. ఒకవైపు నిర్మాతలు పట్టించుకోవడం లేదు. మరోవైపు ఎంతో ప్లాన్ చేసి తీయించుకున్న ఫోటోలు సరిగా రాకపోవడంతో... బాగా ఫ్రస్టేట్ అవుతోందట ఇల్లీబేబి. ఏమైనా మెచ్చినోడు తీసినవి తనకే నచ్చకపోతే.. ఇక ఈ అమ్మడి రీఎంట్రీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది అసలు టాపిక్.