Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీని సాన బట్టేస్తున్నారమ్మో..

By:  Tupaki Desk   |   18 March 2015 10:10 AM IST
ఇల్లీ బేబీని సాన బట్టేస్తున్నారమ్మో..
X
'ఎ' బ్రాండ్‌ సినిమాల్లో కసరత్తులే వేరు. అక్కడ కోచ్‌ అన్నీ చేసేస్తుంటాడు. ఓ వైపు పర్సనల్‌ ట్రైనింగ్‌, బాడీ మసాజ్‌లు చేస్తూనే, ఇతరత్రా పనులన్నీ కథానాయికతో ముగించేస్తుంటాడు. శృంగారం ఆరోగ్యానికి ఉపకరించే సిసలైన మసాజు అనేది ఆ సినిమాల సారాంశం. అయితే అదే ఫార్మాట్‌ కాకపోయినా ఇంచుమించు అలాంటి ఫార్మాట్‌లోనే బాలీవుడ్‌ కథానాయికలు జిమ్ములకు వెళ్లి కసరత్తులతో కాలయాపన చేస్తూ ఉంటారు.

బాడీ బిల్డింగులు, మసాజులు వగైరా వగైరా ఉంటాయి. అందుకోసం ప్రత్యేకించి పర్సనల్‌ శిక్షకుడిని కూడా నియమించుకుంటారు. అలా బాలీవుడ్‌లో కథానాయికలకు ప్రత్యేక శిక్షణనిచ్చే జిమ్‌ కోచ్‌గా యాస్మిన్‌ కరాచీవాలా అనే విదేశీ వనిత పేరుతెచ్చుకుంది. బాలీవుడ్‌లోని స్టార్‌ హీరోయిన్లందరికీ తనే వ్యక్తిగత శిక్షణ ఇస్తుంటుంది. కరీనా కపూర్‌, కత్రినకైఫ్‌, దీపిక పదుకొన్‌, ఆలియాభట్‌, ప్రీతిజింతా, మలైకా అరోరాఖాన్‌ ఇలా స్టార్‌లెందరినో సానబట్టింది యాస్మిన్‌.

ఇప్పుడు అదే తీరుగా సన్నజాజి సోయగం, నడువొంపు నాగరం ఇలియానాకి కూడా తనే వ్యక్తిగత శిక్షణనిస్తోంది. లెగ్‌ రైజెస్‌, స్టమక్‌ ఎక్సర్‌సైజులు, డంబెల్స్‌ సహా అన్ని రకాల కసరత్తుల్ని చేయిస్తోంది కోచ్‌. ఆ దృశ్యాలు చూసినవారికి కొన్ని ఇతరత్రా సందేహాలు కూడా వచ్చేలా ఓ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి మరి