Begin typing your search above and press return to search.
అక్కడ కూడా 'లైగర్' కు బిగ్ షాక్!
By: Tupaki Desk | 27 Aug 2022 11:30 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురిచేసింది. బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి ఛార్మీ, పూరి నిర్మించిన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. విజయ్ దేవరకొండ కఠోర శ్రమకు తగ్గ ప్రతి ఫలం లభిస్తుందని తనతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆశించిన ఫలితాన్ని 'లైగర్' రాబట్టలేకపోయింది.
రిలీజ్ కు ముందు బాయ్ కాట్ వివాదం...దీని విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్ మెంట్.. వెరసి సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేశాయి. ఎవ్వడి మాట వినేది లేదు అంటూ విజయ్ చేసిన ట్వీట్ మరింత ట్రెండ్ కావడంతో బాయ్ కాట్ ట్రెండ్ కు పోటీగా ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ లైగర్ అంటూ ట్రెండ్ అయ్యేలా చేసి బాయ్ కాట్ ట్రెండ్ ని కూడా విజయవంతంగా సినిమా ప్రమోషన్స్ కు వాడుకున్నారు.
దీంతో లైగర్ మరింతగా వార్తల్లో నిలిచింది. కానీ విజయ్ పడిన కష్టానికి తగ్గట్టుగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన పనితననాన్ని పర్ ఫెక్ట్ గా చూపించి వుంటే 'లైగర్' ఫలితం మరో లెవెల్లో వుండేది. కానీ అలా జరగలేదు. విజయ్ దేవరకొండ ఫైటర్ గా ట్రాన్స్ ఫార్మ్ కావడం కోసం శ్రమించిన దాంట్లో పూరి వందవ వంతు కూడా ట్రై చేయకపోవడంతో 'లైగర్' బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఇదిలా వుంటే ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకూ తగ్గుతూ వరుస షాకులిస్తోంది.
ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇదిలా వుంటే 'లైగర్' కు ఐఎండీబీలోనూ బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. విజయ్ నటించిన 'అర్జున్ రెడ్డి' మూవీకి ఐఎండీబీలో 8.0/10 రేటింగ్ లభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 'లైగర్' మూవీకి మాత్రం దారుణమైన రేటింగ్ అక్కడ లభించింది. ఈ మూవీకి 1.6/10 రేటింగ్ దక్కడం విజయ్ దేవరకొండ అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది.
ఈ ఏడాది అట్టర్ ఫ్లాప్ లుగా నిలిచిన అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షాబంధన్' చిత్రాలకంటే అత్యంత తక్కువ రేటింగ్ 'లైగర్'కు నమోదు కావడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది.
ఈ ఏడాది ఇంత వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ఐఎండీబీ రేటింగ్ ని ఇంత తక్కువగా పొందిన సినిమా ఇదే కావడం గమనార్హం. లాల్ సింగ్ చడ్డా కు 5, రక్షా బంధన్ కు 4.6, షంషేరా కు 4.9, 'దొబారా' కు 2.9 రేటింగ్ ని ప్రేక్షకులు ఇచ్చారు.