Begin typing your search above and press return to search.
'#PSPK28' పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్..!
By: Tupaki Desk | 24 April 2021 8:51 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా పవన్ కెరీర్ లోనే అప్పటికి అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది. అందుకే ఈ పవర్ ఫుల్ కాంబోలో మరో సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల తర్వాత పవన్ - హరీష్ కాంబోలో '#PSPK28' అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
రోజులు గడిచే కొద్దీ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు అభిమానులు. 'వకీల్ సాబ్' తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన పవన్ కు హరీష్ మరో బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ తో 'ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు' అంటూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసాడు హరీష్ శంకర్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా #PSPK28 ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ స్టైల్ గా రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని ఉన్నట్లు డిజైన్ చేయబడిన ఈ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్ మేడ్ ఈ రేంజ్ లో ఉంటే అఫీసియల్ పోస్టర్ ఎలా ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ '#PSPK28' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. రామ్ - లక్ష్మణ్ లు యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2021 ద్వితీయార్థంలో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.