Begin typing your search above and press return to search.
పునీత్ సినిమా వల్ల ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ కు చిక్కులు
By: Tupaki Desk | 27 Jan 2022 11:30 AM GMTకన్నడ పవర్ స్టార్ పునీత్‌రాజ్ కుమార్ ఇటీవల హఠాత్తుగా గుండె పోటు కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్నిఇప్పటికీ అభిమానులు, చాలా మంది సినీ ప్రియులు నమ్మలేకపోతున్నారు. పలు ఇండస్ట్రీలకి చెందిన సినీ సెలబ్రిటీలు కూడా పునీత్ ఇంకా తమ మధ్యే వున్నాడని భావిస్తున్నారు. పునీత్ చివరగా `యువరత్న` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ కన్నడతో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆయన చనిపోయే నాటికి ఓ చిత్రాన్ని పూర్తి చేశారు. అదే `జేమ్స్`.
ఈ మూవీ విషయంలో కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన `జేమ్స్` మూవీ ఫస్ట్ లుక్ ని రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఆర్మీ ఆఫీసర్‌గా పునీత్ కనిపిస్తున్న ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది.
పత్తికొండ కిరణ్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ ఆర్మీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించిన ఈ మూవీ చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
పునీత్ నటించిన చివరి చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ జయంతి. ఈ సందర్భంగా `జేమ్స్` మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి కన్నడ డిస్ట్రీబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సంపూర్ణ మద్దతుగా నిలవడం పలువురిని ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ఈ సినిమా విడుదలైన మార్చి 17 నుంచి ఇదే నెల 24 వరకు కన్నడ చిత్రాలతో పాటు మరో ఇతర భాషలకు చెందిన చిత్రాలు రిలీజ్ చేయకూడదని తీర్మాణం చేసుకున్నారట.
అంటే మార్చి 17 నుంచి ఇదే నెల 24 వరకు కర్ణాటక స్టేట్ వ్యాప్తంగా థియేటర్లలో `జేమ్స్` సినిమా తప్ప మరో సినిమా కనిపించడానికి వీళ్లేదన్నది డిస్ట్రీబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నిర్ణయం. ఈ నిర్ణయంతో పుణీత్ కు గ్రేట్ ట్రిబ్యూట్ నివ్వబోతుండటం పలు ఇండస్ట్రీలని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ మేకర్లని కలవరానికి గురిచేస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పరిస్థితులు అనుకూలించి `ఆర్ ఆర్ ఆర్` ని మార్చి 18నే రిలీజ్ చేయాల్సి వస్తే `జేమ్స్` కారణంగా కర్ణాటక లో ఇబ్బందులు తలెత్తే అవకాశం వుంది. ఇదే పరిస్థితి `రాధేశ్యామ్` కు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. `రాధేశ్యామ్` చిత్రాన్ని మార్చి ఫస్ట్ ఫ్రైడే లేడా సెకండ్ ఫ్రైడే న ఈ మూవీని రిలీజ్ చేయాలని లేని పక్షంలో ఏప్రిల్ ఫస్ట్ ఫ్రైడే లేడా సెకండ్ ఫ్రైడే న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ముందు అనుకుంటున్న డేట్ లో `రాధేశ్యామ్` విడుదలైతే మాత్రం కర్ణాటకలో ఇబ్బందులు పడాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.