Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ స్క్రిప్ట్ కు మెరుగులు?
By: Tupaki Desk | 25 Sep 2020 3:30 AM GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆంరభంలో సినిమా షూటింగ్ హైదరాబాద్ తో పాటు పలు చోట్ల జరిగిగింది. సమ్మర్ వరకు సినిమాను పూర్తి చేయాలనుకున్న దర్శకుడు శివకు కరోనా షాక్ ఇచ్చింది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన అన్నాత్తే షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. రజినీకాంత్ లేకుండా నయనతార.. కీర్తిసురేష్.. ఖుష్బు... మీనా.. ప్రకాష్ రాజ్ లతో షూటింగ్ ను నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకాష్ రాజ్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నారు.
ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా రజినీకాంత్ మరియు దర్శకుడు శివలు రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉంటూ స్ర్కిప్ట్ కు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సినిమాలోని రజినీకాంత్ చెప్పే పంచ్ డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. స్వయంగా రజినీకాంత్ పలు పంచ్ డైలాగ్స్ ను దర్శకుడికి సూచించారట. టైం ఎక్కవగా లభించడంతో కమర్షియల్ ఎలిమెంట్స్ పై శ్రద్ద పెట్టాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.