Begin typing your search above and press return to search.

వైఫ్ రెండో పెళ్లికి హీరో స‌సేమిరా..!

By:  Tupaki Desk   |   20 May 2022 5:30 AM GMT
వైఫ్ రెండో పెళ్లికి హీరో స‌సేమిరా..!
X
గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్ త‌న భార్య‌ అవంతిక మాలిక్ నుంచి విడిపోనున్నార‌ని గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా ఈ జంట విడివిడిగా ఉండ‌టంతో ఈ రూమ‌ర్స్ మ‌రింతగా స్ప్రెడ్ అయ్యాయి. అవంతిక మాలిక్ -ఇమ్రాన్ ఖాన్ ల బాండింగ్ ముగిసిపోవచ్చు అంటూ బాలీవుడ్ మీడియాలు బ‌ల‌మైన‌ క‌థ‌నాలు వెలువ‌రిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా విడివిడిగా జీవిస్తున్న వీరిద్దరూ సయోధ్యకు ప్ర‌య‌త్నించినా దానికి అంగీక‌రించ‌డం లేదు.

సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే బ్రేక‌ప్ అధికారికం కావొచ్చ‌న్న క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. చిన్ననాటి స్నేహితులు ఇమ్రాన్ - అవంతిక 2011లో బాలీవుడ్ సెల‌బ్ స్టైల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఒక చిన్న కూతురు కూడా ఉంది. కుమార్తె ఎదిగే క్ర‌మంలో ఈ జంట నిర్ణ‌యం అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం అవంతిక విడాకుల అనంత‌రం రెండో వివాహానికి అవకాశం కోరుకుంటోంది. కానీ ఇమ్రాన్ దీనిని ``క్లోజ్డ్ చాప్టర్`` అని అంటున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అవంతిక మాలిక్ పాలిహిల్ 24 నుండి వెళ్లిపోయిన క్ర‌మంలో కుమార్తె ఇమారాతో పాటు ఇమ్రాన్ నివాసం ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అవంతిక తల్లి వందన ఓ ఇంటర్వ్యూలో ``భార్య భర్తల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిని ఎలాగైనా పరిష్కరించుకుంటాం`` అని ఆశాభావం వ్య‌క్తం చేసారు. విడాకులు తీసుకునే అవకాశం లేదని కూడా చెప్పారు. కానీ పెద్ద‌లు ఎంత ప్ర‌య‌త్నించినా ఈ జంట మాట విన‌డం లేద‌నేది తాజా గుస‌గుస‌.

ఇమ్రాన్ - అవంతిక మధ్య ఉన్న సమస్యల్లో ఒకటి ఏమిటంటే.. అతను నటనను కొనసాగించాలని ఆమె (వైఫ్ అవంతిక‌) కోరుకున్నప్పుడు అతను దానిని వదిలేయాలనుకున్నాడు. చివరికి ఇద్దరి న‌డుమా మ‌న‌స్ఫ‌ర్థ‌లు పెరిగి విడిపోవడానికి దారితీసింది. కానీ వారి అభిమానులు అనుచరులు ఇప్పటికీ వారు రాజీపడాలనే ఆశతో ఉన్నారు.

అవంతిక నిగూఢ‌మైన వ్యాఖ్య‌లు:

బ్రేక‌ప్ వార్త‌ల న‌డుమ అవంతిక క్రిప్టిక్ పోస్ట్ ఒక‌టి అంత‌ర్జాలంలో ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యింది. దీనిలో న‌ర్మ‌గ‌ర్భంగా త‌మ మ‌ధ్య ఉన్న క‌ల‌త‌ల‌ను అవంతికి ప్ర‌స్థావించింది. ``వివాహం కష్టం. విడాకులు కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. ఊబకాయం కష్టం. ఫిట్ గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. అప్పులు చేయడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. కమ్యూనికేషన్ కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. . మీ కష్టాన్ని ఎన్నుకోండి. జీవితం ఎప్పటికీ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టతరంగా ఉంటుంది. కానీ మనం మన కష్టాన్ని ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి`` అని ఇద్దరి మధ్య క‌ల‌త‌ల‌ గురించి ఓపెనైంది. అవంతిక రహస్య పోస్ట్ ను షేర్ చేయ‌గా అది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.