Begin typing your search above and press return to search.
ప్రముఖ నటుడి విడాకులపై అతడి అత్త క్లారిటీ?
By: Tupaki Desk | 22 Oct 2020 12:30 AM GMTఈ ఆధునిక సమాజంలో బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. ప్రేమ పేరుతో మునిగితేలడం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కాపురం చేయడం.. అంతే త్వరగా విడిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిదైతే మూడు పెళ్లిళ్లు, ఆరు విడాకులుగా సంసారం నడుస్తోంది.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య అవంతిక మాలిక్ మధ్య సంబంధాలపై రకరకాల ప్రచారం సాగుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇటీవల అవంతిక తన కుమార్తె బర్త్ డే నిర్వహించగా హీరో ఇమ్రాన్ హాజరు కాలేదు. దీంతో వాల్లిద్దరూ విడిపోయినట్లుగా ప్రచారం జరిగింది.
తాజాగా అవంతిక తల్లి చేసిన పోస్టు వైరల్ గా మారింది. విడాకుల వార్తలపై ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఓ ప్రముఖ రచయిత కవిత్వాన్ని ఆమె పోస్ట్ చేశారు. వివాహంలో కష్టాలు, సుఖాలు వస్తాయని.. జీవితం సులభం కాదని.. తెలివిగా ఆలోచించి జీవితాన్ని సాగాలని.. కష్టసుఖాలను ఎదుర్కోవాలని ఆ కవిత సారాంశం.
దీన్ని అల్లుడు ఇమ్రాన్ తో కూతురు అవంతికకు విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్నారని.. ఇంకా విడాకులు కాలేదని సమాచారం. వీరిద్దరూ ఒకటి కావాలని ఇలా పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.