Begin typing your search above and press return to search.
భార్యతో కలతలు వదిలి రాజీకొస్తున్న హీరో
By: Tupaki Desk | 19 April 2020 4:42 AM GMTభార్య పోరుకు వారు వీరు అని ఏం ఉంటుంది! సాక్షాత్తూ శ్రీవారే బాధితులు. ఎవరైనా అతీతుడు అయ్యే ఛాన్సుంటుందా? ..అంటే ఛాన్సే లేదు. ఆ కోవలోనే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కి భార్యతో చికాకులు తప్పలేదు. ఇమ్రాన్ ఏడాదిన్నర కాలంగా తన భార్య అవంతిక మాలిక్ కి దూరంగానే ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న జంట విడివిడిగా ఉండడంపై బాలీవుడ్ లో పెద్ద డిబేట్ నడిచింది. వ్యక్తిగత జీవితంలో చికాకులన్నీ ఇమ్రాన్ కెరీర్ పైనా తీవ్రంగానే ప్రభావం చూపించాయని అది అమీర్ ని ఎంతో కలతకు గురి చేసిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
యువ జంట కలతలపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. తొందర్లోనే ఈ జంట విడాకులు తీసుకోవడం గ్యారెంటీ! అని ముంబై మీడియా ప్రచారం చేసింది. ఈ ప్రచారం అమీర్- ఇమ్రాన్ అభిమానులందరికీ షాక్ నిచ్చింది. గత ఏడాది జూన్ నుండి విడివిడిగా నివసిస్తున్న ఈ జంట ఇవన్నీ పుకార్లు అని కానీ .. నిజాలు అని కానీ అస్సలు ధృవీకరించలేదు. తమపై సాగిన ప్రచారాన్ని ఖండించనూలేదు. అయతే ఇన్ని పుకార్ల నడుమ .. అవంతిక ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఒక రహస్య విషయాన్ని చేరవేసింది. ఆ పోస్ట్ సారాంశం.. తాము ఒకరితో ఒకరు మళ్లీ రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇచ్చింది. అవంతిక తన గారాల కుమార్తెను ముద్దుపెట్టుకునే చిత్రాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ పోస్ట్ కు ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. నేను ప్రేమతో హత్తుకుపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ``ద్వేషాన్ని భరించడం చాలా పెద్ద భారం`` అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సూక్తిని వెల్లడించి.. ప్రేమలోని స్వచ్ఛతను నేను విశ్వసించాల్సిన అవసరం వచ్చినప్పుడు విశ్వం నాకు ఒక సంకేతాన్ని పంపుతుంది ... అదొక మ్యాజిక్!!`` అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. గత ఏడాది జూన్ లో కుమార్తె ఇమారాతో కలిసి అవంతిక ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుండి విడిగా జీవిస్తోంది. తరచూ తన కుమార్తెతో ఉన్న ఫోటోల్ని అవంతిక షేర్ చేయడం అభిమానులు గమనిస్తూనే ఉన్నారు.
అవంతిక కానీ.. ఇమ్రాన్ కానీ తమపై వచ్చిన రూమర్లపై ఇప్పటివరకు స్పందించనేలేదు. అవంతిక తల్లి వందన మాలిక్ ఇంతకుముందు ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతున్నప్పుడు కుమార్తె విడాకులపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. ఎనిమిది సంవత్సరాలుగా డేటింగ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ - అవంతిక మాలిక్ 2011లో వివాహం చేసుకున్నారు. వారి మొదటి సంతానం కుమార్తె ఇమారా 2014 లో జన్మించింది. ఇమ్రాన్ ఖాన్ కెరీర్ మ్యాటర్స్ చూస్తే.. జానే తు ... యా జానే నా- కిడ్నాప్- ఐ హేట్ లవ్ స్టోరీస్- దిల్లీ బెల్లీ- గోరి తేరే ప్యార్ మే చిత్రాల్లో నటించాడు. చివరిసారిగా 2015 `కట్టి బట్టి`లో నటించాడు. అయితే వ్యక్తిగత జీవితంలో డిస్ట్రబెన్సెస్ అతడి కెరీర్ ని ప్రభావితం చేశాయని అర్థమవుతోంది.