Begin typing your search above and press return to search.
ఒక్క శాతం కూడా ఇంట్రెస్ట్ లేదన్న త్రిష
By: Tupaki Desk | 28 Dec 2022 11:30 PM GMTటాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న త్రిష ఇప్పటికి కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగానే ఉంది. తెలుగు లో సినిమాలు కాస్త తగ్గించినా కూడా తమిళంలో నటించిన సినిమాల డబ్బింగ్ వర్షన్ తో తెలుగు లో సందడి చేస్తూనే ఉంది.
ఇటీవలే ఈమె నటించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. త్వరలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 తో ఈమె ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
ఆ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇక ఈ అమ్మడు రాజకీయాల్లో అడుగు పెట్టబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.
జయలలిత అంటే త్రిషకు చాలా ఇష్టం.. ఆమె ఆదర్శంగానే త్రిష రాజకీయాల్లో అడుగు పెట్టే ఉద్దేశ్యంతో చర్చలు జరుపుతుంది అంటూ పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రిష ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అంది. తనకు రాజకీయాల్లో రాణించాలని.. రావాలని ఒక్క శాతం కూడా ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది త్రిష వివాహం ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయమై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.