Begin typing your search above and press return to search.
అల అమెరికాపురములో.. థమన్ వ్వాటే ప్లాన్?
By: Tupaki Desk | 5 July 2021 6:10 AM GMTవిదేశాల్లో సంగీత కచేరీలకు ఎలాంటి గిరాకీ ఉంటుందో తెలిసిందే. అమెరికా లాంటి చోట్ల మన సంగీతదర్శకులు సీనియర్ గాయకులు ఇప్పటికే ఎన్నో కచేరీలు (లైవ్ కాన్సెర్టులు) నిర్వహించి గొప్ప ఆర్జకులుగా ఉన్నారు. ఈ కచేరీలతో సంగీత దర్శకుడు.. గాయనీగాయకుల ఆదాయం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. పైగా విదేశీ విహారాలు సహా ఎన్నారైల్లో గొప్ప పేరు గుర్తింపు దక్కుతుంది.
అయితే కరోనా వల్ల ఇలాంటి పర్యటనలకు పెద్ద పంచ్ పడిపోయింది. ఆదాయం కూడా జీరో అయిపోయింది. అమెరికా లాంటి చోట్ల కరోనా విలయ తాండవం ఆడడంతో అన్ని కచేరీలకు బ్రేక్ పడిపోయింది. కానీ ఆరంభం మహమ్మారీ విషయంలో తడబడిన అమెరికా తమ దేశంలో ఉన్న 20కోట్ల మందికి శరవేగంగా వ్యాక్సినేషన్ చేయించి ఇప్పుడు ధీమాగా ఉంది. అందుకే భారతదేశంలో లేని అవకాశం అమెరికాలో కలుగుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ తో కలిసి హంసిని ఎంటర్ టైన్ మెంట్స్- `ఆహా-వీడియో` బృందాలు సరైన ప్లాన్ తో ముందుకొచ్చాయి. అల మ్యూజిక్ ఆల్బమ్ ని చార్ట్ బస్టర్ గా నిలిపిన థమన్ నేతృత్వంలో అమెరికాలో భారీ లైవ్ కాన్సెర్ట్ కి ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. కరోనా విలయం తర్వాత అమెరికాలోని భారతీయ ఎన్నారైలకు ఇది అతి పెద్ద వినోద కార్యక్రమం కానుంది.
దీనికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారకర్తగా ఉన్నారు. తాజాగా తన అలా వైకుంఠపురములో స్వరకర్త తమన్ తదుపరి సంగీత కచేరీ `అల అమెరికాపురములో` ప్రత్యేక వీడియో ప్రోమోను ఆయన ఆవిష్కరించారు. ఎస్.ఎస్. థమన్ షోమ్యాన్ లా ఈ వీడియోలో ఎంట్రీ ఇవ్వగా.. లెజండరీ డ్రమ్మర్ శివమణి ప్రశంసలు పొందిన ఫ్లూటిస్ట్ నవీన్ తో పాటు వీడియోలో తమ ప్రదర్శనతో కనిపించారు. తమన్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ వీడియోలో ఆశ్చర్యపరిచారు.
``ప్రజలు తమన్ మాయాజాలం విన్నారు..AVPL సంగీతం రూపంలో.. #అల అమెరికాపురములో ప్రత్యక్షంగా మ్యాజిక్ ఎక్స్ పీరియెన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను అతని సంగీతాన్ని ఆస్వాధించినట్టే.. అమెరికాలోని ప్రజలు దీన్ని ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నా సోదరుడికి శుభాకాంక్షలు`` అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. `అల అమెరికాపురములో` టూర్ అమెరికాలోని పలు నగరాల్లో జరుగుతుంది. హంసిని ఎంటర్ టైన్ మెంట్స్ సంగీత ప్రదర్శనను నిర్వహిస్తోంది. కచేరీ గురించి మరిన్ని వివరాలు వీడియోలో అందుబాటులో ఉన్నాయి.