Begin typing your search above and press return to search.

భూ వివాదంలో కోర్టుకు హాజరైన హీరో రానా

By:  Tupaki Desk   |   13 July 2022 7:47 AM GMT
భూ వివాదంలో కోర్టుకు హాజరైన హీరో రానా
X
టాలీవుడ్ యంగ్ స్టార్‌ హీరో రానా కోర్టుకు హాజరు అయ్యాడు. ఒక భూ వివాదంలో భాగంగా కోర్టు విచారణకు హాజరు అయిన రానా తన తరపు న్యాయమూర్తి ద్వారా తన వాదనలను కోర్టుకు వినిపించడం జరిగింది. కోర్టు కు రానా హాజరు అయిన విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకు రానా ఎందుకు కోర్టుకు వెళ్లాడు అనే విషయమై చర్చ జరుగుతోంది.

అసలు విషయానికి వస్తే... కొన్ని సంవత్సరాల క్రితం రామానాయుడు స్టూడియో కు సమీపంలో ఉన్న 2200 గజాల స్థలాన్ని వెంకటేష్ మరియు సురేష్ బాబులు కలిసి ఒక వ్యక్తికి లీజ్ కు ఇవ్వడం జరిగింది.

లీజ్ గడువు ముగిసేందుకు ఇంకా సమయం ఉంది. ఆ లీజ్‌ గడువు ముగియకుండానే వెంకటేష్ మరియు సురేష్ బాబులు ఆ స్థలం ను ఖాళీ చేయమంటున్నారు అంటూ ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు.

ఆ భూమి వెంకటేష్ మరియు సురేష్ బాబుల పేరు మీద ఉండగా.. ఇటీవల రానా పేరు మీద కొంత భాగం ను రిజిస్ట్రర్ చేయడం జరిగిందట. భూ వివాదం కోర్టు కేసులో ఉండగా రానా తన పేరున కొంత రిజిస్ట్రేషన్ కు సిద్ధం అయిన విషయాన్ని సదరు పిటీషనర్‌ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లాడట. దాంతో రానా కోర్టు లో విచారణకు హాజరు అవ్వాల్సి వచ్చింది.

తన కుటుంబ ఆస్తి అయిన సదరు భూమిని అవసరాల నిమిత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అది తన హక్కుగా భావిస్తున్నాను అన్నట్లుగా కోర్టు లో రానా వాదించారని తెలుస్తోంది. లీజ్ విషయం తో తనకు సంబంధం లేదు అన్నట్లుగా రానా కోర్టుకు తెలియజేశాడట. మొత్తానికి రానా కోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించడంతో తుది తీర్పు ఏం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే తాజాగా ఈయన విరాటపర్వం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వైపు ఈయన కీలక పాత్రలో బాబాయి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ కోసం చేస్తున్న విషయం తెల్సిందే. రానా నాయుడు వెబ్‌ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.