Begin typing your search above and press return to search.
'బీస్ట్' విషయంలో అక్కడే పొరపాటు జరిగిందేమో!
By: Tupaki Desk | 16 April 2022 2:30 AM GMTవిజయ్ హీరోగా ఈ నెల 13వ తేదీన 'బీస్ట్' థియేటర్లకు వచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. విజయ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన సినిమాలకి ఒక రూపాయి ఖర్చు చేస్తే అది పది రూపాలను వెంటేసుకుని వస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. అంత ఫాలోయింగ్ .. అంత మార్కెట్ ఆయన సొంతం. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా .. అంతకుముందు చేసిన సినిమాల రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తుంటుంది.
తమిళనాట మాస్ సెంటర్స్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన వెంటనే ఆయన సినిమా చూడటానికి అక్కడి ప్రేక్షకులు పోటీపడుతుంటారు. అంతగా విజయ్ సినిమా కోసం వాళ్లంతా ఎదురుచూస్తుంటారు . అయితే ఈ సారి 'బీస్ట్' విషయంలో ఫలితం వాళ్లని కాస్త నిరాశ పరిచినట్టుగా తెలుస్తోంది. నిజానికి సన్ పిక్చర్స్ వారు నిర్మాణ విలువల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడరు. క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడాన్ని తమ సంస్థ ప్రతిష్ఠ గా వారు భావిస్తారు. అలాగే 'బీస్ట్' ఖర్చు విషయంలో వెనుకడుగు వేయలేదు. కథ అంతా ఒక మాల్ చుట్టూ తిరిగినప్పటికీ, రిచ్ నెస్ తగ్గనీయలేదు.
ఈ సినిమాకి ముందు దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ రెండు సినిమాలు మాత్రమే చేశాడు. నయనతారతో చేసిన 'కొలమావు కోకిల' పెద్ద హిట్. ఇక శివ కార్తికేయన్ తో చేసిన 'డాక్టర్' అవలీలగా 100 కోట్లను తెచ్చిపెట్టింది. అందువలన విజయ్ .. సన్ పిక్చర్స్ పెద్దగా ఆలోచన చేయలేదు. ఉన్నది రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ అయినప్పటికీ, నెల్సన్ తన టాలెంట్ చూపించాడు. విజయ్ యాక్టింగ్ లో తనదైన స్టైల్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఆ స్టైల్ ను రాబట్టడంలో నెల్సన్ సక్సెస్ అయ్యాడు. అలాగే పూజ హెగ్డేను మరింత గ్లామరస్ గా చూపించడంలోను సక్సెస్ అయ్యాడు.
అయితే ఆరంభంలోనే హీరో .. హీరోయిన్లను మాల్ లో ఇరికించేసి, వాళ్ల వైపు నుంచి ఆడియన్స్ ఆశించే రొమాన్స్ ను .. పాటలను లాక్ చేసేశాడు. అందరూ కూడా యోగిబాబు నుంచి కామెడీని ఆశించారు. కానీ ఆయన పాత్ర నామ మాత్రమైపోయింది. వీటీవీ గణేశ్ డైలాగ్ డెలివరీ .. సింపుల్ కామెడీనే కొంతవరకూ రిలీఫ్ ఇచ్చింది. ఇక ఈ కథలో విలన్స్ గా తీవ్రవాద నాయకుడైన ఒమర్ ఫరూక్ .. హోమ్ మినిష్టర్ .. ఆయన సూచనల మేరకు మాల్ ను హైజాక్ చేసే వ్యక్తి కనిపిస్తారు. కానీ బలమైన విలన్ గా విజయ్ ని ఎదిరించేవారుగా ఎవరూ కనిపించరు.
ఒమర్ ఫరూక్ పాత్రను పవర్ఫుల్ గా చూపించకపోవడం మైనస్ గానే చెప్పుకోవాలి. ఆ పాత్రను హైలైట్ చేసే ప్రయత్నమే జరగలేదు. ప్రాణభయంతో ఆయన పరుగులు తీయడం చూస్తే, ఇతని కోసమా విజయ్ యుద్ధ విమానం వేసుకుని వెళ్లింది అనిపిస్తుంది. విజయ్ క్రేజ్ కీ .. ఆయన రేంజ్ కి తగిన బలమైన తారాగణం లేకపోవడం .. ఉన్న పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. రొమాన్స్ పాళ్లు తగ్గడం .. యాక్షన్ ను ఎమోషన్స్ కి కనెక్ట్ చేయకపోవడం ప్రధానమైన లోపాలుగా కనిపిస్తాయి.