Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్' ని సింగిల్ లైన్ లో తేల్చేశారు!
By: Tupaki Desk | 23 Sep 2022 9:07 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై మెగా హీరో రామ్ చరణ్, ఆర్. బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. 'ఆచార్య' వంటి చేదు జ్ఞాపకం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.
రెండున్నరేళ్ల విరామం తరువాత చిరు నటించిన 'ఆచార్య' ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోవడంతో ఫ్యాన్స్ చాలా వరకు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే 'గాడ్ ఫాదర్' భారీ విజయాన్ని సాధించిన 'ఆచార్య' జ్ఞానకాల్ని చెరిపేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నా టీజర్, రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ ని ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో కొతంతగా ఏదైనా చేస్తారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అంతే కాకుండా సినిమా రిలీజ్ కి సరిగ్గా 12 రోజులు మాత్రమే వుండంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు. ప్రత్యేక ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లతో ప్రచారాన్ని హోరెత్తించాలని ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో క్రేజీ యాంకర్ శ్రీముఖి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోని శుక్రవారం విడుదల చేశారు. 'ఇన్ ద క్లౌడ్స్ విత్ గాడ్ ఫాదర్' పేరుతో ప్రత్యేక చిట్ చాట్ కు సంబంధించిన వీడియో ప్రోమోని రిలీజ్ చేశారు.
ఆకాశ వీధుల్లో విహరిస్తూ ప్రత్యేక ఫ్లైట్ లో చేసి ఇంటర్వ్యూ పూర్తి వీడియోని ఈ నెల 25న విడుదల చేయబోతున్నారు. 'రాజకీయాలకు దూరంగా వున్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ చిరు రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియో గురించి.. తనకు సినిమాలో హీరోయిన్ లేదు.. పాటలు లేవు అనే ఆలోచన ఎవ్వరికీ కలగకుండా చేసిన సబ్జెక్ట్ ఇదని, సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమతో ఈ సినిమా చేశాడని.. ఇందుకు అతనికి హ్యాట్సాఫ్ అంటూ చిరు వెల్లడించారు..
పూరి జర్నలిస్ట్ క్యారెక్టర్ లో చస్తే చేయనన్నాడట. అయితే ఆ పాత్రలో పూరిని చూసి అంతా ఆశ్చర్యపోతారని, సినిమాకు ఆరో ప్రాణంగా నిలిచిన వ్యక్తి తమన్ అని ఒక్క మాటలో చెప్పాలంటే 'గాడ్ ఫాదర్' నిశ్మబ్ద విస్పోటనం అంటూ మెగాస్టార్ సింగిల్ లైన్ లో తేల్చేశారు. ఈ పూర్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో చిరు ఇంకా ఎలాంటి విషయాల్ని వెల్లడించారో తెలియాలంటే ఈ నెల 25 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.