Begin typing your search above and press return to search.

చివ‌ర‌కు హీరోయిన్లూ బాలీవుడ్ ని న‌మ్మ‌డం లేదు!

By:  Tupaki Desk   |   10 Sep 2022 11:30 PM GMT
చివ‌ర‌కు హీరోయిన్లూ బాలీవుడ్ ని న‌మ్మ‌డం లేదు!
X
ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ క‌థానాయిక‌ల వ‌రుస మారింది. హిందీ చిత్ర‌సీమలో సంధి కాలం కొన‌సాగుతుండ‌డంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్లు సైతం సౌత్ సినిమా వైపు చూస్తున్నారు. ఇక్క‌డ ఏమాత్రం అవ‌కాశం వ‌చ్చినా వెంట‌నే ఓకే చెప్పేందుకు ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం క‌నిపిస్తోంది.

ఇంత‌కుముందే దీపిక ప‌దుకొనే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కేలో దీపిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్ర‌ద్ధా క‌పూర్ కూడా సాహో త‌ర్వాత‌ సౌత్ సినిమాపై ఆస‌క్తిగా ఉంది. దీపిక- శ్ర‌ద్ధా త‌ర‌హాలోనే ఇప్పుడు దిశా ప‌టానీ కూడా పూర్తిగా సౌత్ పై ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది.

అటు బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల కంటే ఇక్క‌డ టాప్ హీరోల‌తో క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. అందుకే ఇంత‌కుముందు ప్ర‌భాస్ మూవీ ప్రాజెక్ట్ కేలో న‌టించేందుకు దిశా ప‌టానీ ఓకే చెప్పింది. ఇప్పుడు ద‌క్షిణాదిన మ‌రో పెద్ద స్టార్ అయిన సూర్య స‌ర‌స‌న న‌టించేందుకు దిశా ప‌టానీ 'ఎస్' చెప్పేసింది.

ఎగ్జ‌యిట్ అవుతున్న దిశా ఏక్ విలన్ రిటర్న్స్‌లో విలన్ అవతార్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దిశా పటాని త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అంత‌కుముందు స‌ల్మాన్ భాస్ స‌ర‌స‌న న‌టించిన సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. తాజా స‌మాచారం మేర‌కు సౌత్ స్టార్ హీరో సూర్యతో తన తదుపరి చిత్రాన్ని దిశా అధికారికంగా ప్రకటించింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని తాత్కాలికంగా సూర్య 42గా పిలుస్తున్నారు. దిశా ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన భారీ ప్రాజెక్ట్ ల‌లో భాగమైంది.

సూర్యతో తన తదుపరి ప్రాజెక్ట్ పై తన ఉత్సాహాన్ని దిశా పంచుకుంది. సూర్య సర్ - శివ సర్ లతో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని ప్రకటించడానికి చాలా ఉద్వేగంగా ఉన్నాను అని తెలిపింది దిశా. బుల్లితెరపై ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తానని హామీ ఇచ్చే భారీ ప్రాజెక్ట్ ఇది. తాను పోషిస్తున్న పాత్ర చాలా ప్రత్యేకమైనదని, ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆస‌క్తిగా ఉన్నామ‌ని తెలిపింది.

సూర్య 42 మోషన్ పోస్టర్ ను ఇటీవల ఆన్ లైన్ లో విడుదల చేసిన మేకర్స్ ఈ చిత్రాన్ని 3డిలో రూపొందిస్తున్నారని దీనిని 10 భాషలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టర్ ని బట్టి చూస్తే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. సూర్య 42 హిస్టారికల్ సినిమానా లేక‌ వార్ నేప‌థ్య‌ చిత్రమా? అన్న‌దానిపై అభిమానుల‌కు సందేహాలున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.