Begin typing your search above and press return to search.
అర్థరాత్రి చిరు-దేవీశ్రీ హుటాహుటీన హెలీకాఫ్టర్ లో!
By: Tupaki Desk | 9 Jan 2023 4:03 AM GMTచివరి నిమిషంలో వెన్యూ మార్పుతో 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆటంకాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ఈ వేడుక ఏయు గ్రౌండ్స్ లో మొదలైంది. వేడుక కూడా ఆలస్యంగానే ముగిసింది. అయినా వేలు లక్షల్లో తరలి వచ్చిన అభిమానులతో ఏయు గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. ఏయు ఔటర్ గేట్ నుంచి ప్రీరిలీజ్ వేదిక వద్దకు (400 మీటర్ల దూరం)వెళ్లేందుకు ఒక్కో మెగాభిమానికి గంట సమయం పట్టిందని అనుభవం అయిన ఒక అభిమాని తుపాకికి ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించారంటే ఎంత భారీగా మెగా ఫ్యాన్స్ క్యూకట్టారో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది అభిమానులు ఏయు ఔట్ గేట్ వద్దనే పడిగాపులు పడటం కనిపించింది.
ఇక వెన్యూ అకస్మాత్తుగా మార్చాల్సి రావడంతో ఆర్కే బీచ్ లో వేసిన సెట్లు అన్నీ తొలగించి తిరిగి ఏయు గ్రౌండ్స్ కి తరలించడానికి స్టేజీ ప్రిపరేషన్ కి చాలా డిలే కావడంతో వీరయ్య టీమ్ అంతా చాలా టెన్షన్ పడింది. అదే సమయంలో వాల్తేరు వీరయ్య పోస్ట్ ప్రొడక్షన్ లో పెండింగ్ పనులు కూడా చిరు అండ్ టీమ్ ని టెన్షన్ పెట్టాయని సమాచారం.
అయితే మరోవైపు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు డీఐ పనులు వగైరా జరుగుతున్నాయి. రాక్ స్టార్ దేవీశ్రీకి వైజాగ్ ఈవెంట్ కి హాజరయ్యే సమయం కూడా లేదు. ఛాయాగ్రాహకుడు అర్థర్ . ఏ విల్సన్ కి ఆ పనులన్నీ అప్పజెప్పి బాస్ చిరంజీవి కోసం దేవీశ్రీ ఈ వేడుకకు విచ్చేసారు. దీంతో చిరు తిరిగి దేవీశ్రీని పంపేందుకు ప్రత్యేక హెలీకాఫ్టర్ ఏర్పాటు చేసారు.
రాత్రికే రాత్రే అన్నపూర్ణ స్టూడియోలో దించేస్తాను దేవీని అంటూ చిరంజీవి ప్రీరిలీజ్ వేదికపైనే బహిరంగంగా వెల్లడించారు. అంటే ఈవెంట్ రాత్రి 11 గం.టల వరకూ సాగగా ఆ తర్వాత దేవీశ్రీ హుటాహుటీన హైదరాబాద్ అన్న పూర్ణ స్టూడియోస్ లో పనుల కోసం హెలీకాఫ్టర్ లో మిడ్ నైట్ చేరుకున్నారన్నమాట. వాల్తేరు వీరయ్య పనులన్నీ పూర్తయిన కానీ వీఎఫ్ ఎక్స్ సహా డీఐలో ఇంకా బెటర్ మెంట్ కోసం పనులు సాగుతున్నాయి. వీటన్నిటినీ మెగాస్టార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దేవీశ్రీ అన్నయ్యను విడిచి ఉండరు. అలా ఆ ఇద్దరూ కలిసే హెలీకాఫ్టర్ లో మిడ్ నైట్ వైజాగ్ ఏయు గ్రౌండ్స్ నుంచి బయల్దేరారు.
రకరకాల కారణాలతో ఈవెంట్ వెన్యూ మారినా కానీ దీనిని సక్సెస్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల తెగింపు సహకారం గురించి కూడా పరిశ్రమ వర్గాల్లో బోలెడంత చర్చ సాగుతోంది. వీరసింహారెడ్డి వేదిక వెన్యూ మార్పు సమయంలోను ఎంతో సహనంగా మైత్రి సంస్థ అధినేతలు నవీన్-రవి వ్యవహరించారు. ఈవెంట్ నిర్వాహకులకు కోఆర్డినేట్ చేసి అవసరమైన సాయం చేసారు. పట్టుదల కసి ఉన్న నిర్మాతలు ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు అంటే ఏంటో చూపించారు. రెండు ఈవెంట్లకు అవసరమైన ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్యను ... వీర సింహారెడ్డిని గెలిపించేందుకు ఇన్ని టెన్షన్ల నడుమ మైత్రి నిర్మాతలు రవి-నవీన్ లు తపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.