Begin typing your search above and press return to search.

'ఐ.ఎన్.జి' కంటెంట్ కంటే బోల్డ్ నెస్ శృతిమించిందా..??

By:  Tupaki Desk   |   20 Jun 2021 11:30 PM GMT
ఐ.ఎన్.జి కంటెంట్ కంటే బోల్డ్ నెస్ శృతిమించిందా..??
X
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. కరోనా టైం ప్రారంభం అయినప్పటి నుండి ఓటిటిలకు ఆదరణ పెరిగిపోయింది. అందుకే ఇతర భాషల్లో సక్సెస్ అవుతున్న వెబ్ సిరీస్ ల వైపు దృష్టిపెడుతూ మనవాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుగులో ఫేమస్ ఓటిటి ఆహా అందుబాటులో ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ పరంగా సక్సెస్ అందుకోలేకపోతుందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి తెలుగు వెబ్ సిరీస్ లు నిరాశపరుస్తూ వచ్చాయి. రిలీజ్ ముందు హైప్ మాత్రం భారీగానే సెట్ చేస్తున్నాయి.

కానీ తీరా స్ట్రీమింగ్ మొదలయ్యాక ఆకట్టుకోవడంలో నిరాశకు గురి చేయడం గురించి సోషల్ మీడియాలో పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆహాలో 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ గా రిలీజ్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఆశించిన థ్రిల్ కలిగించడం లేదని టాక్ వస్తోంది. ఎందుకంటే సిరీస్ కంటెంట్ కంటే కూడా మేకర్స్ డైలాగ్స్ బోల్డ్ సన్నివేశాల పై ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రారంభంలో స్టోరీ ట్విస్టులు ఇంటరెస్టింగ్ గానే ఉన్నప్పటికీ రెండు ఎపిసోడ్స్ గడిచాక థ్రిల్ మిస్ అయిందని కథనాలు చెబుతున్నాయి.

అయితే యాక్టింగ్ పరంగా అయితే నందిని రాయ్.. ప్రియదర్శి.. వికాస్.. పోసాని లాంటి వారు ఆకట్టుకున్నా డైలాగ్స్ మాత్రం కొంచం చికాకు కలిగిస్తాయని అంటున్నారు. ఎందుకంటే ఇందులో బోల్డ్ సన్నివేశాలతో పాటు బూతులు కూడా పుష్కలంగా ఉన్నాయట. మరి బోల్డ్ సీన్స్ లో మాత్రం నందిని రాయ్ పల్లెటూరు అమ్మాయిగా.. పక్కింటి మగాళ్లను లైన్ లో పెడుతూ ఇరగదీసింది. అలాగే ఊహించని బూతులు అభిమాన యాక్టర్స్ నుండి కూడా రావడం అనేది కొంచం జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాలలో బూతులు అవసరం లేకపోయినా ఇరికించిన ఫీలింగ్ కూడా వస్తుందని అంటున్నారు. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సురేష్ కృష్ణ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిం